Search This Blog

Monday, September 12, 2016

శివరంజని

ఒకసారి శివుడు మోహినిని చూసి ముచ్చటపడి ఆమె వెనక బయలుదేరాడుట. అప్పుడు ఆ మోహిని ఒక ఉద్యానవనం లో ఒక రాగములో ఆలపిస్తూ ఉంటుంది. ఆ రాగము శివుడిని రంజింప చేసింది. శివుడినిరంజింప చేసింది కాబట్టి ఆ రాగము  అప్పటి నుంచి '  శివరంజని ' రాగముగా ప్రశిద్ధికెక్కింది. 




శివరంజని రాగము ఖరహరప్రియ రాగానికి జన్యరాగము. ఈ రాగములో ఆరోహణ అవరోహణలలో ఐదు స్వరాలు మాత్రమే ఉపయోగిస్తారు.... కాబట్టి ఇది ఔడవ రాగం. కరుణ, విషాదానికి ప్రశిద్ధి ఈ రాగము. హిందూస్తానీ శివరంజని రాగానికి, కర్నాటక సంగీతంలో ఏడు స్వరాలు ఉన్న శివరంజని రాగానికి ఎటువంటి సంబంధము, పోలికలు లేవు.



ఆరోహణ :   స రి గ ప – ద – స (పై షడ్జమం) 


అవరోహణ: స (పై షడ్జమం) ధ ప – గ స్ – రి స స్


పకడ్ స్వరాలు ఈ విధంగా ఉంటాయి...


గ ప ధ స (పై షడ్జమం) – ధ ప – గ స్ రి – స


సినిమా పాటలలోకి వస్తే ఈ రాగములో ఎక్కువగా పాటలు పలికించిన ఘనత 'రమేశ్ నాయుడు ' కి దక్కుతుంది. అతి తక్కువ వాయిద్యాలతో చక్కనైన పాటలు అందించారు. ఇక ఇళయరాజా అయితే విషాద కి ప్రశిద్ధి చెందిన రాగములో గొప్ప ప్రణయగీతాన్ని సృష్టించారు (అబ్బ నీ తియ్యనీ దెబ్బ).


ఆకాశవాణి సిగ్ నేచర్ ట్యూన్ కూడా శివరంజని రాగములో నే చేయబడింది. 



ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమ పాటలు : 


* అన్నా అన్నా విన్నావా - ఇలవేల్పు
* అంతా బ్రాంతి ఏనా జీవితాన వెలుగింతేనా - దేవదాసు
* బఠో బైఠో పెళ్ళికొడకా.. ఆల్ రైటో రైటో నా పెళ్ళికూతురా - పెళ్ళి సందడి
* బుగ్గి అయిన నా బ్రతుకు - పల్నాటి యుద్ధం
* ఓ వీణ చెలి నా ప్రాణ సఖి - చంద్ర హాస
* నా జీవితం నీకంకితం - శ్రీకృష్ణ విజయం
* నిను వీడని నీడను నేనే - అంతస్థులు
* శ్రీరాముని చరితము తెలిపెదమమ్మ - లవకుశ
* తీరేనుగా నేటితో నీ తీయని గాధ - పెళ్ళి కానుక
* సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు - పుట్టినిళ్లు మెట్టినిల్లు
* చరిత్ర ఎరుగని మహాపాతకం - మహామంత్రి తిమ్మరసు
* ఏల పగాయె ప్రభు మనకు - లైలా మజ్ఞు
* వగల రాణివి నీవే - బందిపోటు
* చాలదా ఈ చోటు - నేనంటే నేనే
* కనులలో నీ రూపం - రావణుడే రాముడైతే
* ఒకటైపోద్దామా ఊహల వాహిణిలో - ఆస్తులు అంతస్థులు
* గుట్ట మీద గువ్వ కూసింది - బుద్ధిమంతుడు
* మెరిసే మేఘమాలిక - దీక్ష
* ఆకాశ దేశానా - మేఘసందేసం
* కనుపాప కరవైన కనులెందుకు - చిరంజీవులు
* అంతర్యామి అలసితి సొలసితి - అన్నమయ్య
* శివరంజని.. నవరాగిని - తూర్పు పడమర
* అభినవ తారవో - శివరంజని
* నా గొంతు శృతిలోనా - జానకి రాముడు
* పాడవోయి భారతీయుడా - వెలుగు నీడలు
* వీణ నాది తీగ నీది - కటకటాల రుద్రయ్య
* రాయినైనా కాకపోయిని రామ పాదము సోకగా - గోరంత దీపం
* చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి - ప్రేమ సాగరం
* ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం - రంగూన్ రౌడి
* వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది - కల్యాణ వీణ
* ఓ బంగరు రంగుల చిలక - తోట రాముడు
* ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నె మనసులు
* జననీ జన్మభూమిశ్చ - బొబ్బిలి పులి
* ఇది తొలి రాత్రి - మజ్ఞు
* ఇది చదరని ప్రేమకు శ్రీకారం - అంకుశం
* అందమైనా వెన్నెలలోనా అచ్చ తెనుగు పడుచువలే - అసెంబ్లీ రౌడి  
* నీ కళ్ళలో స్నేహము - ప్రేమ ఖైది
* ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెల ఏరు - సిరివెన్నెల
* ఈ జగమే ఈ జగమే ఆగెను నిన్ను చూసి - నిలాంబరి
* శివాని..భవాని - స్వాతి కిరణం
* చందమామ కథలో చదివా - ఈ అబ్బాయి చాలా మంచోడు
* సౌందర్యమా కలగన్న కాశ్మీరమా - ఫూల్స్
* అమ్మమ్మ మాయగాడే - పేళ్ళి సంబంధం
* అది ఒక రాతిరి - జగన్
* పాటల పల్లకి పై ఊరేగే చిరుగాలి - నువ్వొస్తావని
* సన్నజాజి పువ్వా.. చిరునవ్వే నవ్వవా - యువరత్న
* ఈ గాలిలో ఎక్కడో అలికిడి - అగ్ని పర్వతం
* ఓ బంగరు రంగుల చిలక - తోటరాముడు
* మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు - ముద్దుల మావయ్య
* హరి ఓం భజగోవిందం - రాజా రమేశ్
* నువ్వు లేక అనాధలం - శిరిడి సాయి మహత్యం
* పెళ్ళంటే పందిళ్లు - త్రిశూలం
* కనురెప్ప పాడింది కనుసైగ పాట - జయసుధ
* మధుమాసపు మన్మధ రాగమా - ఆయనకిద్దరు
* ఏదో మనసుపడ్డాను కానీ - అమ్మ దొంగ
* సింధూరపువ్వా తేనె చిందించరావా - సింధూరపువ్వు
* గగనాలకేగిన చిరు తారవో - పాపే మా ప్రాణం
* ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా - అడవి రాముడు (కొత్తది)
* అనగనగా ఒక నిండు చందమామ - పెళ్ళిపందిరి
* నేనొక పూల మొక్క కడ నిల్చి (పుష్ప విలాపం ) 




ఈ రాగములో ఉన్న హింది పాటలు :




* జానే కహా గయే వో దిన్ - మేరా నాం జోకర్
* ఆవాజ్ దేఖే హమే తుం బులాదో - ప్రొఫెసర్
* మేరే నైనా సావన్ భాధో - మెహబూబా
* ఓ మేరే సనం - సంగమ్
* నా కిసి కీ ఆంఖ్ క నూర్ హూ - లాల్ ఖిలా
* లగే నా మోరా జియా - గూంఘట్
* పియా మిలన్ కి - పియా మిలన్ కి
* సన్సార్ హై ఎక్ నదియ - రఫ్ తార్
* ఓ సాతీ రే తెరే బినా క్యా జీనా - ముకద్దర్ కా సికందర్
* నజర్ ఆతీ నహి మంజిల్ - కాంచ్ ఔర్ హీరా
* తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ - ఏక్ దూజే కే లియే
* గుం నాం హై కోయి - గుమ్ నామ్
* దిల్ నే ఫిర్ యాద్ కియా - దిల్ నే ఫిర్ యాద్ కియా
* బహారో ఫూల్ బర్సావో - సూరత్
* మేరి కిస్మత్ మే తూ నహీ షాయద్ - ప్రేమ్ రోగ్
* చందామామా దూర్ కే - వచన్
* బనాకే క్యూ బిగాడా రే - జంజీర్
* దిల్ కె ఝరోకోమే తుఝ్ కో బిటాకే - బ్రహ్మచారి
* మిల్తీ హై జిందగీ మే ముహోబత్ ఖభీ ఖభీ - ఆఖే
* సాత్ సాత్ రెహనా మేరీ సారీ జిందగి - దిల్వాలే
* హం తో చెలే పర్దేస్ హం పర్దేశీ హో గయే - సర్గమ్
* యాద్ మేరీ ఆయేగీ - ఏక్ జాన్ హై హం
* తుం సే మిల్కర్ నాజానే క్యూ - ప్యార్ ఝుక్తా నహీ
* ఖభీ ముఝే రులాయా - ఖయామత్
* తడప్ తడప్ కే ఇస్ దిల్ సే ఆహ నికల్ తీ హుయీ - హం దిల్ దే చుకే సనమ్
* తూ నే ప్రీత్ జో ముఝ్సే జోడి - మీరా కా మోహన్
* నా జారే యూ ముఝే చోఢ్ కే - ఆజ్ కా అర్జున్
* ప్యార్ క పల్చిన్ బీతే హుయే దిన్ - కువారి
* మేర ప్యార్ భీ తూహై - సాథి
* సూరజ్ కి గర్మీ సే - పరిచయ్
* తేరే సంగ్ ప్యార్ మై నహీ తోడ నా - నాగిన్
* పర్బత్ సే కాలీ గటా టక్రాయి - చాందిని
* బాబుల్ కి దువాయే లేతీ జా - నీల్ కమల్
* సూరజ్ కబ్ దూర్ గగన్ సే - కరణ్ - అర్జున్
* రంగ్ ఔర్ నూర్ కి బారాత్ కిసే పేష్ కరూ - గజల్
* నా కోయి ఉమంగ్ హై - కటీ పతంగ్
* కహి దీప్  జలే కహి దిల్ - బీస్ సాల్ బాద్
* ఓ పియా పియా క్యూ భులా దియా - దిల్
* దోస్త్ దోస్త్ నా రహా - సంగమ్
 



No comments:

Post a Comment