Search This Blog

Monday, September 12, 2016

హిందోళ రాగం

                           



శాస్త్రీయ సంగీతము ఇరవైయ్యోవ మేళకర్త నఠభైరవి. ఆ నఠభైరవి రాగానికి జన్యరాగము ఈ హిందోళ రాగము.  


ఆరోహణ: స మ గ మ ద ని స

అవరోహణ:  స ని ద మ గ స



హిందోళం వొక విలక్షణమైన రాగం.  సంగీత జ్ఞానం లేని వారు సైతం ఈ రాగంలో స్వరపరిచిన పాటలను వింటే పారవశ్యంతో తలలూపాల్సిందే. ఈ రాగంలోని పాటలు వింటే జీర్ణ కాలేయ సంబంధమైన వ్యాధులు నిదానిస్తాయిట.  


హిందోళ రాగములో ఉన్న కొన్ని ప్రముఖ కీర్తనలు :



సామజ వరగమన - త్యాగయ్య
మనసులోని మర్మమును తెలుసుకో - త్యాగయ్య
మమవతుశ్రీ సరస్వతి - మైసూర్ వాసుదేవాచార్య
మనసులోని మర్మమును తెలుసుకో - త్యాగయ్య
నీరజాక్షి కామాక్షి -
సామగాన లోలనే  సదా శివ శంకరనే
కొండలలో నెలకొన్న కోనేటి - అన్నమాచార్య
దేవదేవం భజే - అన్నమాచార్య
భామనే సత్యా భామనే - యక్షగానము
కట్టెదుట వైకుంఠము - అన్నమాచార్య
గరుడ గమన - అన్నమాచార్య
నిగమా నిగమాంతర వర్ణిత - అన్నమాచార్య 


ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :



*  శ్రీకర కరుణాలవాల - బొబ్బిలి యుద్ధం
* చూడుమదే చెలియా - విప్రనారాయణ
* మూగవైన ఏమిలే - అప్పుచేసి పప్పు కూడు
* మనమే నందన వనమే గదా - మా ఇంటి మహాలక్ష్మి
* వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ - పరమానందయ్య శిష్యుల కథ
* పతియే ప్రత్యక్ష దైవమే - ఆమె కథ
* అందాలు చిందెడి ఆనంద సీమ - చింతామణి
* శ్రితజనపాల - దేవంతకుడు (పాతది)
* మధురమైన గురు దీవెన - స్వర్ణ మంజరి
* నన్ను వదిలి నీవు పోలేవులే - మంచి మనసులు
* సందేహించకుమమ్మా- లవకుశ
* కలనైనా నీ తలపే - శాంతినివాసం
* నారాయణా హరి నారాయణా - చెంచులక్ష్మి
* పగలే వెన్నెలా - పూజాఫలం
* శ్రీకరమగు పాలన నీదే - మహాకవి కాళిదాసు
* నేనే రాధనోయీ - అంతా మన మంచికే
* పిలువకురా అలుగకురా - సువర్ణ సుందరి
*  ఓహో మోహన రూపా గోపాలా - శ్రీకృష్ణ తులాభారం
* మనసే వికసించెనే - అమరశిల్పి జక్కన
* దేవదేవ పరంధామ - సీతా రామ కల్యాణం
* వీణ వేణువైన సరిగమ -ఇంటింటి రామాయణం
* అభినందన మందార మాల - తాండ్రపాపారాయుడు
* కొత్త కొత్తగా ఉన్నది - కూలీ నెం.  1
*  ఏం వానో ముసురుతున్నది - నారీ నారీ నడుమ మురారి
*  మనసులోని మర్మమును తెలుసుకో - నారీ నారీ నడుమ మురారి
* రాజశేఖరా నీపై మోజు తీరలేదురా- అనార్కలి
* జయవాణి కమల చరణ - మహామంత్రి తిమ్మరుసు
* గిరిజా కల్యాణం (సాగమ సాగమ ) - రహస్యం
* క్షితి రితి విపుల తలే - భక్త జయదేవ
* లక్ష్మీ వల్లభ దీన శరణ్య  - భక్త ప్రహ్లాద
* కలనైనా నీ వలపే - శాంతి నివాసం
* అందమె ఆనందం - బ్రతుకు తెరువు
* రామ కథను వినరయ్యా - లవకుశ
* మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం
*  సాగర సంగమమే ప్రణయ…- సీతాకోక చిలుక
* రారా.. స్వరముల సోపానమునకు - సంకీర్తన
*  మావి చిగురు తినగానే - సీతామాలక్ష్మి
* స్వరములు ఏడైనా  - తూర్పు - పడమర
*  ఆడవే అందాల సురభామిని - యమగోల
* రంగులలో కలవో - అభినందన
* ఓం నమఃశివాయ - సాగర సంగమం
* పాడాలనీ ఉన్నది - చిళ్ళర దేవుళ్ళు
* నిగమా నిగమాంతర వర్ణిత - అన్నమయ్య
* దయ చూపవే గాడిదా - జాతక రత్న మిడతంబొట్లు
* గున్నమామిడి కొమ్మ మీద - బాల మిత్రుల కథ
* నమ్మకు నమ్మకు ఈ రేయిని - రుద్ర వీణ
* చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ - నీ స్నేహం
* పొడగంటినయ్యా నిన్ను పురుషోత్తమా - అన్నమయ్య
* వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట - గంగోత్రి
* గుప్పెడు గుండెను తడితే - బొంబాయి ప్రియుడు
* ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి - స్తూడెంట్ నెం.  1
* కాస్త నిన్ను నేను నన్ను నువ్వు తాకుతుంటే - స్తూడెంట్ నెం. 1
*  దైవం మానవ రూపంలో - శ్రీశిరిడి సాయి మహత్యం  
*  బలపం పట్టి భామ బళ్లో - బొబ్బిలి రాజా
* పాహీ త్రిలోకైక జనని - కనక దుర్గ మహిమ
* ముసిన ముత్యాలకేలే - అన్నమయ్య
* పాడనా శిలను కరిగించు గీతం - శీను వాసంతి లక్ష్మి
* బాలమురళి కృష్ణ నాకు బాల్య మిత్రుడే - బొంబాయి ప్రియుడు
*  ముసిముసి నవ్వుల లోనా - బ్రహ్మ



 హిందుస్తానీ సంగీత సంప్రదాయంలో దీని పేరే మాల్కోస్.  


ఈ రాగములో ఉన్న కొన్ని హింది పాటలు : 


* ఆయే సుర్ కే పంచి - సుర్ సంగం

* ఆధ హై చంద్మా రాత్ ఆధి - నవ్ రంగ్
* తూ చుపి హై కహా - నవ్ రంగ్
* అఖియ సంగ్ అఖియ లగి - బడే ఆద్మి
* దీప్ జలాయే జో గీతోంకి  - కలాకార్
* జానే బహార్ హుస్న్ తెరా - ప్యార్ కియా తో డర్న క్యా
* మన్ తరపత్ హరి దర్శన్ కో - బైజు బావ్రా
* ఏ మాలిక్ తేరే బందే హం - దో ఆఖే బారహ్ హాత్
* మన్ మోహనా పియా తూ జో మిలే - ఫూల్ కా సేజ్
* జానే వాలే ఓ మేరా ప్రాణ్ - గీత్ గాయా పత్తరోనే
* దేఖో చం చం గుంగురూ బోలే - కాజల్
* మెరే బహిస్ కొ దండా క్యూ మారా - పగ్లా కహి కా
* ఖలియో కి గూంఘట్ - దిల్ నె ఫిర్ యాద్ కియా


కాఫీ రాగము




శాస్త్రీయ సంగీతములో ఇరవైరెండొవ  మేళకర్త రాగము ఖరహరప్రియ.  ఖరహరప్రియకు జన్య రాగలలో ఒకటి 'కాఫీ " రాగము.  


ఆరోహణ :  S R g m P D n s


అవరోహణ :  s n D P m g R S 




ఈ రాగములో ఉన్న కొన్ని ప్రసిద్ధి చెందిన కొన్ని కీర్తనలు : 



వందేమాతరం, వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ రచించిన భారత జాతీయగేయం.
అతడే ధన్యుడురా.. ఓ మనసా - త్యాగరాజు కీర్తన
అన్యాయము సేయకురా రామ - త్యాగరాజు కీర్తన
పావన రామ నామ సుధారస పానము జేసేదెన్నటికో - రామదాసు కీర్తన
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి - రామదాసు కీర్తన
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము - రామదాసు కీర్తన
జానకి రమణ కళ్యాణ సజ్జన - రామదాసు కీర్తన



'కాఫీ " రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు ...




*  ఓం నమశివాయ నవనీత హృదయ - శ్రీకాళహస్తి మహత్యం
*  జయమంగళ గౌరీ దేవీ- ముద్దు బిడ్డ
* దేవ దేవ ధవలాచల - భూకైలాస్
* పిలిచిన బిగువటరా - మల్లీశ్వరి
* కోతీబావకు పెళ్ళంట - మల్లీశ్వరి
* ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ - శ్రీవేంకటేశ్వర మహత్యం
* నీకై వేచితినయ్య - శ్రీకృష్ణార్జున యుద్ధం
* యమునా తీరమున ( పూపొదలో దాగెనేల ) - జయభేరి
* ఎవడే అతడెవ్వడే - విప్రనారాయణ
* కామిని మదన రారా - పరమానందయ్య శిష్యుల కథ
* లాలీ లాలీ కను కన్నయ్య - పెద్దరికాలు
* తగునా వరమీయా - భూకైలాస్
* వద్దురా కన్నయ్య - అర్ధాంగి
* హైలో హైలెస్స హంస కదా నా పడవ - భీష్మ
* నేను తాగలేదు - మనుషులు - మమతలు
* ఆది లక్ష్మివంటి అత్తగారివమ్మ - జగదేకవీరుని కథ
* హాయిగా ఆలుమగై కాలం గడపాలి - మాంగల్యబలం
* ఓ సుకుమార నిను గని మురిసితిరా - సీతారామ కల్యాణం
* నలుగురు నవ్వేరురా - విచిత్ర దాంపత్యం
* అందాల బొమ్మతో ఆటాడవా - అమరశిల్పి జక్కన
* ఎవరురా.. నీవెవరురా - అగ్గి రాముడు
* ఏ పంచెవన్నెల చిలక - అప్పుచేసి పప్పు కూడు
* ఔనంటే కాదనిలే - మిస్సమ్మ
* వెన్నెల్లో గోదారి అందం - సితార
* జో అచ్యుతానంద - అన్నమయ్య
* ఏమివ్వగలదానరా - వసంత సేన
* మన మనసు మనసూ ఏకమై - జీవితం
* నీలాల కన్నుల్లో మెల మెలగా - నాటకాల రాయుడు
* ఓహో బస్తీ దొరసాని - అభిమానం
* ఓ మరదలా మదిలో పొంగే వరదలా - అప్పు చేసి పప్పు కూడు
* ప్రళయపయోధి జలే - భక్త జయదేవ
* నడుమెక్కడే నీకు నవలామణి - కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
* నవరససుమ మాలిక - మేఘసందేశం
* తెల్లారే దాక నువ్వు తలుపు మూసి తొంగుంటే - ప్రేమ పక్షులు
* కొంటె చూపులెందుకులేరా - శ్రీమంతుడు
* అలలైపొంగెరా - సఖి
* ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను - నువ్వు లేక నేను లేను
* నే తొలిసారిగా కలగన్నది - సంతోషం
* చీకటి వెలుగుల కౌగిటిలో ( గల గలమనకూడదు ) - చీకటి వెలుగులు
* ఎక్కడమ్మా చంద్రుడు  - అర్ధాంగి
* ప్రభు గిరిధారి - పరువు-ప్రతిష్ట
* ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నెవయసు
* నా చెలి రోజావే - రోజ
* పిల్లనగ్రోవి పిలుపు - శ్రీకృష్ణ విజయం
* ఓ సుకుమార నిను గని మురిసితిరా - సీతారామ కల్యాణం
* హరి ఓం .. భజగోవిందం - రాజా రమేశ్
* ఆరనీకుమా ఈ దీపం - కార్తీక దీపం
* వటపత్రశాయికి - స్వాతి ముత్యం
* చందమామ కంచమెట్టి - రామబంటు
* చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటి - వారసత్వం
* మన్సున ఉన్నదీ చెప్పాలనున్నది - ప్రియమైన నీకు






ఈ రాగములో ఉన్న హింది సినిమా పాటలు  : 


* ఏ దినియా క్యా తుఝ్ సే కహే - సుహాగ్
* బిరజ్ మే హోలి ఖేలత్ నంద్ లాల్ - గోదాన్
* బైరనా నీంద్ నా ఆయే - చాచా జిందాబాద్
* కైసే కహూ మన్ కి బాత్ - ధూల్ కా ఫూల్
* తేరే భీగి బదన్ కి కుష్బూ సే - షరాఫత్
* తుమ్హారే ప్యార్ చాహియే ముఝే - మనోకామ్నా
* యే రాత్ యే చాంద్నీ - జాల్
* ఆ అబ్ లౌట్ చలే - జిస్ దేశ్ మే గంగా బెహతీ హై
* సఖి కైసే ధరన్ మైన్ ధిర్ - సంగీత్ సామ్రాట్ తాన్సేన్
* ఏక్ దాల్ పర్ తోతా భోలే ఏక్ దాల్ పర్ మైనా - చోర్ మచాయా షోర్
* కస్మే వాదే ప్యార్ వఫా - ఉప్కార్
* ధీరే ధిరే భోల్ కోయి సున్ నా లే - గోరా ఔర్ కాలా
* దునియా బదల్ గయి - బాబుల్
* షర్మాకే యహ అకోయి - చౌద్ వి కా చాంద్
* మై తేరే ప్యార్ మే క్యా క్యా - జిద్ది
* భవర బడా నాదాన్ హై- షాహిబ్ బీవి ఔర్ గులాం



కీరవాణి




కీరవాణి రాగము కర్ణాటక సంగీతంలో 21వ మేళకర్త రాగము. కీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి.



ఈ రాగం లోని స్వరాలు చతుశృతి ఋషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము. ఈ రాగము రాత్రి వేళలలో వినదగిన రాగము. 


ఆరోహణ :  స రి గ మ ప ద ని స


అవరోహణ : స ని ద ప మ గ రి స  


కీర్తనలు :



అంబా వాణి నన్నాదరించవే - హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్


కలికియుండే - త్యాగరాజ స్వామి


కలిగియుంటే కదా - త్యాగరాజ స్వామి 


శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే గురువరం  -  




ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :



* ఓహోహో పావురమా - స్వర్గ సీమ
* వల్లభాప్రియ వల్లభ - శ్రీ శ్రీకాకుళపు ఆంధ్ర మహా విష్ణువు కథ
* వినుడు వినుడు రామాయణ గాధ - లవ కుశ
* జలకాలాటలలో - జగదేక వీరుని కథ
* గజ్జా ఘళ్లుమంటూంటే - సిరిసిరిమువ్వ
* కొంటె చూపులెందుకు లేరా జుంటి తేనె అందిస్తారా - శ్రీమంతుడు (పాతది)
* ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా - విప్రనారాయణ
* కనుపాప కరవైన కనులెందుకో - చిరంజీవులు  
* కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే - అన్వేషణ
* తాళి కట్టు శుభవేళ - అంతు లేని కథ
* రండి రండి రండి దయచేయండి - రుద్రవీణ
* ఎన్నెన్నో అందాలు - చంటి
* ఓ ప్రేమా నా ప్రేమా - చంటి
* ఊరుకో హృదయమా - నీ స్నేహం
* ముత్యాల చమ్మ చెక్క ముగ్గులేయంగా - మువ్వా గోపాలుడు
* ఓ పాపా లాలి జన్మకే లాలి - గీతాంజలి
* కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెల్లా - కొండవీటి దొంగ
* ఓ ప్రియా ప్రియా - గీతాంజలి
* అరె ఏమయ్యింది - ఆరాధన
* ఎదలో లయ ఎగసే లయ - అన్వేషణ
* పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి - నువ్వొస్తావని
* ఇలలో జరిగే శిధిలాకాశము - అన్వేషణ
* ఎదుటా నీవే... - అభినందన
* సిరిమల్లె పువ్వా - పదహారేళ్ల వయసు
* నిండు నూరేళ్ళ సావాసం - ప్రాణం
* నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా - సంతోషం
* కోకిల.. కోకిలా కోకిలా - కబడి కబడి
* కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం - స్వయంవరం




ఈ రాగములో ఉన్న కొన్ని హింది పాటలు :

( ఓ.పి. నయ్యర్ స్వరపరచిన చాలా పాటలు ఈ రాగములో ఉండటం విశేషం).. 


* యాద్ నా జాయే బీతే దినోకా - దిల్ ఏక్ మందిర్
* గీత్ గాతా హు మై గున్ గునా  తా హు మై - లాల్ పత్తర్
* ఆజా సనం మధుర్ చాంద్ని మే హుం - లవ్ మారేజ్
* దిల్ కి గిరహ్ ఖోల్ దో - రాత్ ఔర్ దిన్
* సున్ చంపా సున్ తారా - అప్న దేష్
* మేరి భీగి భీగి సి - అనామిక
* ఆనే వాలా పల్ జానేవాలా హై - గోల్ మాల్
* తుం బిన్ జావు కహా - ప్యార్ కా మోసం
* మై ప్యార్ క రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీన్
* పుకార్తా చలా హూ మై - మేరే సనం
* ఆఖో సే ఉతర్ తి హై దిల్ మే - ఫిర్ వొహీ దిల్ లాయా హు
* ఆవో హుజూర్ తుంకో - కిస్మత్
* యే హై రేష్మి జుల్ఫే - మేరే సనం
* ఎక్ పర్దేసి మేరా దిల్ లే గయా - ఫల్గున్
* కిత్నే ఖలి కిలే హై చమన్ మే - చించినాతి బబ్లో బూ
* తుం క్యా జునూన్ తుమ్హార యాద్ మే - చించినాతి బబ్లో బూ
* దుఖి మన్ మోరే .. సున్ మెరే కెహనా - ఫంతోష్
* చల్ దియా కర్వాన్ - లైలా మజ్ఞు
* తుంభీ చెలో .. హుంభీ చెలే - జమీన్
* సప్నో మే ఆనా దిల్ మే సమానా - చోర్ అఊర్ చాంద్
* ఓ పియా పియా - డాకు ఔర్ ఇన్సాన్
* శుభహ్ నా ఆయి షాం నా ఆయి - ఛ ఛా ఛ
* రూప్ రంగ్ సే మర్తా ఆయా - శిక్ష
* యే సమా .. సమా హై ఏ ప్యార్ కా - జబ్ జబ్ ఫూల్ ఖిలే
* మామా కల్లు మామా - సత్య
* తుం హవా హై.. తుం ఫిజా హై - ఫిజా
* చార్ దిన్ బహార్ కే - రుక్సానా
* మెర దిల్ యే పుకారే ఆజా - నాగిన్
* తుమ్హార ప్యార్ చాహియే - శిక్ష
* తుమ్హి మేరి పూజా హో - సుహాగ్
* తూ బేమిసాల్ హై తారీఫ్ క్యా కరూ - బ్రహ్మచారి
* పర్బత్ కే ఇస్ పార్ - సర్గం
*  మై గావూ తుం సోజావో - బ్రహ్మచారి
* కణయ్య తేరి మురళి - న్యూ ఢిల్లి
* కల్ కి దౌలత్ ఆజ్ కి ఖుషియా - అస్లి నక్లి
* రింజిం గిరే సావన్ - మంజిల్
* తూ ప్యార్ క సాగర్ హై - సీమ 


శివరంజని

ఒకసారి శివుడు మోహినిని చూసి ముచ్చటపడి ఆమె వెనక బయలుదేరాడుట. అప్పుడు ఆ మోహిని ఒక ఉద్యానవనం లో ఒక రాగములో ఆలపిస్తూ ఉంటుంది. ఆ రాగము శివుడిని రంజింప చేసింది. శివుడినిరంజింప చేసింది కాబట్టి ఆ రాగము  అప్పటి నుంచి '  శివరంజని ' రాగముగా ప్రశిద్ధికెక్కింది. 




శివరంజని రాగము ఖరహరప్రియ రాగానికి జన్యరాగము. ఈ రాగములో ఆరోహణ అవరోహణలలో ఐదు స్వరాలు మాత్రమే ఉపయోగిస్తారు.... కాబట్టి ఇది ఔడవ రాగం. కరుణ, విషాదానికి ప్రశిద్ధి ఈ రాగము. హిందూస్తానీ శివరంజని రాగానికి, కర్నాటక సంగీతంలో ఏడు స్వరాలు ఉన్న శివరంజని రాగానికి ఎటువంటి సంబంధము, పోలికలు లేవు.



ఆరోహణ :   స రి గ ప – ద – స (పై షడ్జమం) 


అవరోహణ: స (పై షడ్జమం) ధ ప – గ స్ – రి స స్


పకడ్ స్వరాలు ఈ విధంగా ఉంటాయి...


గ ప ధ స (పై షడ్జమం) – ధ ప – గ స్ రి – స


సినిమా పాటలలోకి వస్తే ఈ రాగములో ఎక్కువగా పాటలు పలికించిన ఘనత 'రమేశ్ నాయుడు ' కి దక్కుతుంది. అతి తక్కువ వాయిద్యాలతో చక్కనైన పాటలు అందించారు. ఇక ఇళయరాజా అయితే విషాద కి ప్రశిద్ధి చెందిన రాగములో గొప్ప ప్రణయగీతాన్ని సృష్టించారు (అబ్బ నీ తియ్యనీ దెబ్బ).


ఆకాశవాణి సిగ్ నేచర్ ట్యూన్ కూడా శివరంజని రాగములో నే చేయబడింది. 



ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమ పాటలు : 


* అన్నా అన్నా విన్నావా - ఇలవేల్పు
* అంతా బ్రాంతి ఏనా జీవితాన వెలుగింతేనా - దేవదాసు
* బఠో బైఠో పెళ్ళికొడకా.. ఆల్ రైటో రైటో నా పెళ్ళికూతురా - పెళ్ళి సందడి
* బుగ్గి అయిన నా బ్రతుకు - పల్నాటి యుద్ధం
* ఓ వీణ చెలి నా ప్రాణ సఖి - చంద్ర హాస
* నా జీవితం నీకంకితం - శ్రీకృష్ణ విజయం
* నిను వీడని నీడను నేనే - అంతస్థులు
* శ్రీరాముని చరితము తెలిపెదమమ్మ - లవకుశ
* తీరేనుగా నేటితో నీ తీయని గాధ - పెళ్ళి కానుక
* సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు - పుట్టినిళ్లు మెట్టినిల్లు
* చరిత్ర ఎరుగని మహాపాతకం - మహామంత్రి తిమ్మరసు
* ఏల పగాయె ప్రభు మనకు - లైలా మజ్ఞు
* వగల రాణివి నీవే - బందిపోటు
* చాలదా ఈ చోటు - నేనంటే నేనే
* కనులలో నీ రూపం - రావణుడే రాముడైతే
* ఒకటైపోద్దామా ఊహల వాహిణిలో - ఆస్తులు అంతస్థులు
* గుట్ట మీద గువ్వ కూసింది - బుద్ధిమంతుడు
* మెరిసే మేఘమాలిక - దీక్ష
* ఆకాశ దేశానా - మేఘసందేసం
* కనుపాప కరవైన కనులెందుకు - చిరంజీవులు
* అంతర్యామి అలసితి సొలసితి - అన్నమయ్య
* శివరంజని.. నవరాగిని - తూర్పు పడమర
* అభినవ తారవో - శివరంజని
* నా గొంతు శృతిలోనా - జానకి రాముడు
* పాడవోయి భారతీయుడా - వెలుగు నీడలు
* వీణ నాది తీగ నీది - కటకటాల రుద్రయ్య
* రాయినైనా కాకపోయిని రామ పాదము సోకగా - గోరంత దీపం
* చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి - ప్రేమ సాగరం
* ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం - రంగూన్ రౌడి
* వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది - కల్యాణ వీణ
* ఓ బంగరు రంగుల చిలక - తోట రాముడు
* ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నె మనసులు
* జననీ జన్మభూమిశ్చ - బొబ్బిలి పులి
* ఇది తొలి రాత్రి - మజ్ఞు
* ఇది చదరని ప్రేమకు శ్రీకారం - అంకుశం
* అందమైనా వెన్నెలలోనా అచ్చ తెనుగు పడుచువలే - అసెంబ్లీ రౌడి  
* నీ కళ్ళలో స్నేహము - ప్రేమ ఖైది
* ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెల ఏరు - సిరివెన్నెల
* ఈ జగమే ఈ జగమే ఆగెను నిన్ను చూసి - నిలాంబరి
* శివాని..భవాని - స్వాతి కిరణం
* చందమామ కథలో చదివా - ఈ అబ్బాయి చాలా మంచోడు
* సౌందర్యమా కలగన్న కాశ్మీరమా - ఫూల్స్
* అమ్మమ్మ మాయగాడే - పేళ్ళి సంబంధం
* అది ఒక రాతిరి - జగన్
* పాటల పల్లకి పై ఊరేగే చిరుగాలి - నువ్వొస్తావని
* సన్నజాజి పువ్వా.. చిరునవ్వే నవ్వవా - యువరత్న
* ఈ గాలిలో ఎక్కడో అలికిడి - అగ్ని పర్వతం
* ఓ బంగరు రంగుల చిలక - తోటరాముడు
* మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు - ముద్దుల మావయ్య
* హరి ఓం భజగోవిందం - రాజా రమేశ్
* నువ్వు లేక అనాధలం - శిరిడి సాయి మహత్యం
* పెళ్ళంటే పందిళ్లు - త్రిశూలం
* కనురెప్ప పాడింది కనుసైగ పాట - జయసుధ
* మధుమాసపు మన్మధ రాగమా - ఆయనకిద్దరు
* ఏదో మనసుపడ్డాను కానీ - అమ్మ దొంగ
* సింధూరపువ్వా తేనె చిందించరావా - సింధూరపువ్వు
* గగనాలకేగిన చిరు తారవో - పాపే మా ప్రాణం
* ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా - అడవి రాముడు (కొత్తది)
* అనగనగా ఒక నిండు చందమామ - పెళ్ళిపందిరి
* నేనొక పూల మొక్క కడ నిల్చి (పుష్ప విలాపం ) 




ఈ రాగములో ఉన్న హింది పాటలు :




* జానే కహా గయే వో దిన్ - మేరా నాం జోకర్
* ఆవాజ్ దేఖే హమే తుం బులాదో - ప్రొఫెసర్
* మేరే నైనా సావన్ భాధో - మెహబూబా
* ఓ మేరే సనం - సంగమ్
* నా కిసి కీ ఆంఖ్ క నూర్ హూ - లాల్ ఖిలా
* లగే నా మోరా జియా - గూంఘట్
* పియా మిలన్ కి - పియా మిలన్ కి
* సన్సార్ హై ఎక్ నదియ - రఫ్ తార్
* ఓ సాతీ రే తెరే బినా క్యా జీనా - ముకద్దర్ కా సికందర్
* నజర్ ఆతీ నహి మంజిల్ - కాంచ్ ఔర్ హీరా
* తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ - ఏక్ దూజే కే లియే
* గుం నాం హై కోయి - గుమ్ నామ్
* దిల్ నే ఫిర్ యాద్ కియా - దిల్ నే ఫిర్ యాద్ కియా
* బహారో ఫూల్ బర్సావో - సూరత్
* మేరి కిస్మత్ మే తూ నహీ షాయద్ - ప్రేమ్ రోగ్
* చందామామా దూర్ కే - వచన్
* బనాకే క్యూ బిగాడా రే - జంజీర్
* దిల్ కె ఝరోకోమే తుఝ్ కో బిటాకే - బ్రహ్మచారి
* మిల్తీ హై జిందగీ మే ముహోబత్ ఖభీ ఖభీ - ఆఖే
* సాత్ సాత్ రెహనా మేరీ సారీ జిందగి - దిల్వాలే
* హం తో చెలే పర్దేస్ హం పర్దేశీ హో గయే - సర్గమ్
* యాద్ మేరీ ఆయేగీ - ఏక్ జాన్ హై హం
* తుం సే మిల్కర్ నాజానే క్యూ - ప్యార్ ఝుక్తా నహీ
* ఖభీ ముఝే రులాయా - ఖయామత్
* తడప్ తడప్ కే ఇస్ దిల్ సే ఆహ నికల్ తీ హుయీ - హం దిల్ దే చుకే సనమ్
* తూ నే ప్రీత్ జో ముఝ్సే జోడి - మీరా కా మోహన్
* నా జారే యూ ముఝే చోఢ్ కే - ఆజ్ కా అర్జున్
* ప్యార్ క పల్చిన్ బీతే హుయే దిన్ - కువారి
* మేర ప్యార్ భీ తూహై - సాథి
* సూరజ్ కి గర్మీ సే - పరిచయ్
* తేరే సంగ్ ప్యార్ మై నహీ తోడ నా - నాగిన్
* పర్బత్ సే కాలీ గటా టక్రాయి - చాందిని
* బాబుల్ కి దువాయే లేతీ జా - నీల్ కమల్
* సూరజ్ కబ్ దూర్ గగన్ సే - కరణ్ - అర్జున్
* రంగ్ ఔర్ నూర్ కి బారాత్ కిసే పేష్ కరూ - గజల్
* నా కోయి ఉమంగ్ హై - కటీ పతంగ్
* కహి దీప్  జలే కహి దిల్ - బీస్ సాల్ బాద్
* ఓ పియా పియా క్యూ భులా దియా - దిల్
* దోస్త్ దోస్త్ నా రహా - సంగమ్
 



శంకరాభరణం


ధీర శంకరాభరణం రాగాన్నే వాడుకలో శంకరాభరణం అని అందురు. ఇది 29 వ మేళకర్త రాగము. 



ఆరోహణ : : S R2 G3 M1 P D2 N3 S  


అవరోహణ : S N3 D2 P M1 G3 R2 S     


సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం ఐదవ బాణ చక్రంలో ఐదవ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు.  ఈ రాగము సంపూర్ణ రాగము. నలభైకి పైగా జన్య రాగాలు గల విశిష్ట మైన రాగము శంకరాభరణము. అందులో ముఖ్యమైనవి : ఆరభి, అఠాన, బిళహరి, దేవనాగరి, కదనకుతూహలం, హంసధ్వని, సుద్ధ సావేరి, పూర్ణచంద్రిక, కేదరం. 


ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన ' నరసయ్య ' అని చెప్పుకొంటారు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైనది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట.
ఈ రాగము ఉదయం రెండో భాగము ( 9 నుండి మధ్యాహ్నం వరకు) వినే రాగము అయినప్పటికినీ అన్ని వేళలా వినదని రాగము.  ప్రేమకు, భక్తికి, ఆధ్యాత్మితకు , గంభీరానికి, శృంగారానికి , ఆలోచనలకి అణువైన రాగము.
శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతములో బిలావల్ రాగానితో పోల్చవచ్చు.  జాతీయ గీతం "జనగణమణ " ఈ రాగములో స్వరపరిచారు. 


ప్రముఖ కీర్తనలు :


1. ఎదుట నిలచితే - త్యాగరాజ స్వామి
2. మరియాద గాదురా - త్యాగరాజ స్వామి
3. స్వర రాగ సుధ  - త్యాగరాజ స్వామి
4.  ఎందుకు పెద్దలవలె బుద్ధినీయవు - త్యాగరాజ స్వామి
5. మనసు స్వాధీనమైన  - త్యాగరాజ స్వామి
6. బాగు మీరగను (వేంకటేశ పంచరత్రాలలో ఒకటి) - త్యాగరాజ స్వామి
7. సుందరేశ్వరుని జూచి సురలఁ జూడ మనసు వచ్చునా - త్యాగరాజ స్వామి
8. అలరులు కురియగ - అన్నమయ్య
9. ఇతడేనా ఈ లోకములో గల - రామదాసు
10. తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు - రామదాసు
11. ఎంతో మహానుభావుడవు నీవు - రామదాసు
12. దశరధరామ గోవింద నన్ను- రామదాసు
13. రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా - రామదాసు
14. రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె - రామదాసు
15. నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ - రామదాసు
16. అక్షయలింగ విభో - ముత్తుస్వామి దీక్షితార్
17. శక్తిసహిత గణపతిం - ముత్తుస్వామి దీక్షితార్
18. సదాశివం ముపాస్మహే - ముత్తుస్వామి దీక్షితార్
19. దక్షిణామూర్తే - ముత్తుస్వామి దీక్షితార్
20.  దేవి మీన నేత్రి - శ్యామశాస్త్రి
21. సరోజదళ నేత్ర - శ్యామశాస్త్రి
22. శారదే సదాస్రయే - కృష్ణస్వామి అయ్యర్
23. శంభో జగదీశ - రామస్వామి దీక్షితార్
24. పశ్యతి దిశ్యతి (అష్టపది) - జయదేవుడు
25. శంకరాచార్యం - సుబ్బరాయ దీక్షితార్



శంకరాభరణ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :



1. బుద్ధేనాంజలి నమామి - విప్రనారాయణ
2. ఆనందం అర్ణవమైతే - కన్యాశుల్కం
3. ఓంకార నాదానుసంధానమౌ గానమే -  శంకరాభరణం
4. మరచి పోరాదోయ్ చేసిన బాసలు - మనోరమ
5. వెన్నెల్లో గోదారి అందం - సితార
6. ఉరికే చిలకా - బొంబాయి
7. చిన్ని చిన్ని ఆశ - రోజ
8. ఎల్లిపోతోంది ఎల్లిపోతోంది జోడేడ్ల బండి - రోజులు మారాయి
9. నా హృదయం లో నిదురించే చెలి - ఆరాధన
10. జోరుగా హుషారుగా షికారు పోదమా - భార్యాభర్తలు
11. దేవమహదేవ మము బ్రోవుము శివ - భూకైలాస్
12. నలుగిడరే చెలువుగా శ్రీగౌరికి - వినాయక చవితి
13. నాకో తోడు కావాలి - చదువుకున్న అమ్మాయిలు
14. ఇదే పాట ప్రతీ చోట - పుట్టినిల్లు - మెట్టినిల్లు
15. చెట్టులెక్కగలవా ఓ నరహరి - చెంచులక్ష్మి
16. ఓ రంగయో - వెలుగు నీడలు
17. చిలకా గోరింకా కులికే పకా పకా - చెంచులక్ష్మి
18. విన్నావా యశోదమా (కాళింది మడుగున విషమును కలిపే కాళియు తలపై తాందవ మాడి) - మాయాబజార్
19. కానరార కైలాశ నివాశ - సీతారామ కల్యాణం
20. అహా నా పెళ్ళియంట - మాయబజార్
21.కమ్  కమ్ కమ్ కంగారు నీకేలనే - శాంతి నివాసం
22.ఆశలు తీర్చవే జనని - శాంటినివాసం
23.చల్లనైన తల్లివి శంకరు రాణివి - శ్రీ వేంకటేశ్వర మహత్యం
24.అందెను నేడే అందని జాబిల్లి - ఆత్మ గౌరవం
25. నీటిలోన నింగిలోన - వివాహ బంధం
26. వేయి కన్నులు చాలవుగా - సీతారాముల కల్యాణం
27. చిన్నారి నీ చిరు నవ్వు - పసిడి మనసులు
28. అందాల ఓ చిలుకా - లేత మనసులు
29. దేవా దివ్య కృపాకర - కాళహస్తీ మహత్యం
30.పాడవోయి భారతీయుడా (పదవీ వ్యామోహాలు)- వెలుగు నీడలు
31. హల్లో డార్లింగ్ మాటాడవా - శభాష్ రాముడు
32. కులాశ రాదోయ్ రమ్మంటే - అన్నపూర్ణ



ఈ రాగములో హింది సినిమా పాటలు చూద్దాము. 




* భోర్ ఆయి గయా అంధియార - బవర్చి
* సారే కె సారే గామ కో లేకే గాతే చెలే - పరిచయ్
* దిల్ హై చోటా సా చోటి సి ఆష - రోజ
* తుహిరే తుహీరే - బొంబాయ్
* ముఝ్ కో అప్నే గలే లగాలో - హుం రాహీ
* మేరీ లాడ్లీ హై - అందాజ్
* హే దిల్ హై ముషికిల్ జీనా యహా - సి.ఐ.డి
* దిల్ తడప్ తడప్ కే పుకారే - మధుమతి
* ఆజ్ హుం అప్నే దువాకా అసర్ దేఖేగ్నే - పాకీజా
* బచ్పన్ కి ముహోబత్ కో - బైజూ బావరా
* జిందగీ ప్యార్ కే దో చార్ ఘడి - అనార్కలి
* అయేగా ఆనే వాలా - మహల్
* అల్లా తేరో నాం - హం దోనో
* యాద్ కియా దిల్ నే కహాహో తుం - పతిత
* మేరే మెహబూబ్ తుఝే - మెహబూబ్
* పియా తూసే నైన అలాగే రే - గైడ్
* జీవన్ కె సఫర్ మే రాహి - మునిం జీ
* ఏ మేరే హుం సఫర్ ఏ మేరే జానేజా - బాజీ గర్
* హోలే హోలే గూంగట్ - గూంజ్ ఉఠీ షహనాయి
* ఏ దిల్ నా హోతా బేచారా - జువెల్ తీఫ్ 






కల్యాణి రాగము

కల్యాణి రాగము / మేచకల్యాణి రాగము  కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగము. ఇది అతి ప్రాచీన రాగము, ఇది ప్రతి మధ్యమ రాగములలో 'రాణి ' వంటిది. ఇది రుద్ర అను చక్రములో ఐదవ రాగము. ఈ రాగము పూర్వము కళ్యాణి గా పిలువబడేది. కటపయాది సంఖ్య లో ఇముడుట కొరకు "మేచ" అను పదమును "కల్యాణి" యందు అమర్చిరి.  ఇది 29వ మేళకర్త రాగమైన 'ధీరశంకరాభరణం ' యొక్క ప్రతి మధ్యమ సమానము.   మనసును ఎల్ల వేళలా ఆహ్లాదముగా ఉంచుతుంది కాబట్టి ఈ రాగం అన్ని రాగాలలోకి ' రాణి ' రాగముగా ప్రశిద్ధికెక్కింది.  



ఈ రాగంలో షడ్జమము, చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, పంచమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.


ఆరోహణ :     స రి గ మ ప ద ని స
(S R2 G3 M2 P D2 N3 S) 


అవరోహణ :   స ని ద ప మ గ రి స
(S N3 D2 P M2 G3 R2 S) 



విశిష్టత :



ప్రసిద్ధ ప్రతిమధ్యమ రాగము. చాల జన్యరాగ సంతతి గల జనకరాగము. ఈ రాగములో పా మా గా అనునపుడు గాంధారము అంతర గాంధారము లకు కొంచెము ఎక్కువగా నుండును. ఈ రకపు గాంధారమునకు తీవ్ర అంతర గాంధారము అని పేరు. దీనినే ' చ్యుత ' మధ్యము అని ఖూడా అంటారు. 


ఈ రాగం లోని


“రి” ని షడ్జమం చేస్తే హరికాంభోజి,


“గ” ని  షడ్జమం చేస్తే నటభైరవి,


“ప” ని  షడ్జమం చేస్తే శంకరాభరణం,


“ద” ని  షడ్జమం  చేస్తే ఖరహరప్రియ,


“ని” ని  షడ్జమం  చేస్తే తోడి…



కల్యాణి రాగము  పెద్ద రాగము. ఈ రాగము  అన్ని వేళల పాడదగిన రాగమైనప్పటికి  సాయం సమయము సమంజసము.



మేచకల్యాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వాటిలో  ' హమీర్ కల్యాణి ' , ' మోహన కల్యాణి ' , 'సారంగ ', ' సునదవినోదిన ', 'యమన్ కల్యాణి ' మొదలైనవి ప్రముఖమైనవి. 



సినిమా పాటలు ఎక్కువగా ఈ రాగములోనే చేయబడ్డాయి. ఘంటసాల గారికి ఈ రాగము ఇష్టమైనది కావడముతో ఆయన చేసిన సినిమాలో ఒక్క పాటైనా ఈ రాగములో ఉండి తీరాల్సిందే. మన జాతీయ గీతము "జనగణమణ " కూడా కల్యాణి రాగములో ఉండడం ఆ రాగము యొక్క విశిష్టత తెలుపుతోంది. హింధుస్తాన్ సంగీతముతో ఈ రాగాన్ని 'యమన్ కల్యాణి ' గా అభివర్ణిస్తారు.


 కల్యాణి రాగములో ఉన్న ప్రశిద్ధ కీర్తనలు / కృతులు :




నిధి చాల సుఖమా - త్యాగరాజు కీర్తన
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి - రామదాసు కీర్తన
కమలజాదళ విమల సునయన కరి వరద కరునాంబుధే
వనజాక్షరో...
ఎంతటి కులుకే (పదము)- పట్టాభిరామయ్య
నినువినా - సుబ్బరాయశాస్త్రి'
పారెంగుం    - ఘనం కృష్ణయ్య
కమలాంబాం- ముత్తుస్వామి దీక్షితులు
నిజదాసవరద    - పట్నం సుబ్రహ్మయ్యర్
ఎంతటి కులుకే- పట్టాభిరామయ్య
సుందరి నీ దివ్యరూపమును - త్యాగరాజు కీర్తన
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి - రామదాసు కీర్తన



ఈ రాగము లో ఉన్న కొన్ని సినిమా పాటలు :


1. ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల - కల్యాణి

2. హరి కథ లో భూతల నాథుడు - వాగ్ధానం
3. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో - సంతానం
4. చెలికాడు నిన్నె రమ్మని పిలువా చేర రావేలా - కులగోత్రాలు
5.చిగురులు వేసిన కలలన్నీ- పూలరంగడు
6.దొరకునా యిటువంటి సేవ - శంకరాభరణం
7.దొరవో ఎవరివో - కథానాయకి మొల్ల
8.ఎక్కడి దొంగలు అక్కడనే- ఇల్లరికం
9.ఎతవున్నారా నికకడ నీకు - వరుడు కావాలి
10.ఎవరివో నీవెవరివో- పునర్జన్మ
11.ఏమని తెలుపుదురా - చిన్ననాటి స్నేహం
12.ఇది చిరు సరిగమలెరుగని రాగం - హై హై నాయకా
13.జయ జయ జయ సుభసయ - మల్లీశ్వరి
14.జగమే మారినదీ మధురముగా ఈ వేళ- దేశద్రోహులు
15.జయ జయ ప్రియ భారత జనని - రాక్షసుడు
16.రా రా కృష్ణయ్య - రాము (పాతది)
17.కలలు ఫలించే కాలములో - విమల
18.హాయిహాయిగా జాబిల్లి తొలిరేయి - వెలుగు నీడలు
19.కన్నయ్య లాంటి అన్నయ్య లేని - బంగారు బాబు
20. కులాసా రాదోయి రమ్మంటే - అన్నపూర్ణ
21.కనుగవ తానియయ - సువర్ణ సుందరి
22.కిల కిల నవ్వులు చిలికిన - భార్యా భర్తలు
23.వాన కాదు వాన కాదు వరదా రాజా - భాగ్యచక్రం
24.కుండ కాదు కుండ - భాగ్యచక్రం
25.కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - దేవదాసు
26.కనుల ముందు నీవుంటే - చెల్లెలి కాపురం
27.కనులు మాటలాడునని- మాయని మమత
28.లలిత లలిత మురళీ- పాండురంగ మహత్యం
29.మదిలోన మధుర భావం - జయసింహ
30. మది శారదా దేవి మందిరమే- జయభేరి
31.మనసేమిటో తెలిసిందిలే - అన్నపూర్ణ
32.మధుర భావాల సుమమాల - జై జవాన్
33. మనసు పాదింది సన్నాయి పాట - పుణ్యావతి
34. శామలాంబ దండకము లో మాతా మరకత శ్యామా - మహాకవి కాళిదాసు
35. నాదిరదిన్నా నచ్చిన దాని కోసం- ఒకరికి ఒకరు
36.మనసా త్రుళ్ళి పడకే - శ్రీవారికి ప్రేమలేఖ
37.మనసులో ఒకటుంది- కులదైవం
38.మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి - అందాల రాముడు
39.నాసరి నీవని నీ గురినీనని - సి.ఐ.డి
40. నీవే ఆది దైవము - భక్త తుకారాం
41. మనసున మల్లెల మాలలూగెనే - మల్లీశ్వరి
42. నా  నోము ఫలించెనుగా - భూకైలాస్
43. ఓ దేవదా చదువూ ఇదేనా- దేవదాసు
44. పాల కడలిపై శేష తల్పమున - చెంచు లక్ష్మి
45. నేడు శ్రీవారికి మేమంటే పరాకా - ఇల్లరికం
46. పలికెను ఏదో రాగం- సంఘం చెక్కిన శిల్పాలు
47. పల్లెకు పోదాం- దేవదాసు
48. పాడనా వాణి కళ్యాణిగా- మేఘ సందేశం
49. నిఖిల భువనపాల - ఇలవేలుపు
50.ఓ సఖా రావోయి సఖా- అనార్కలి
51.పలుకవే రాణి - స్వర్ణమంజరి
52.పయనించే ఓ చిలుకా ఎగిరిపో - కులదైవం
53.పలుకురాదటే చిలుకల- షావుకారు
54.పెను చీకటాయే లోకం- మాంగల్యం బలం
55.పులకించని మది పులకించు - పెళ్ళి కానుక
56.పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని - పెళ్ళి చేసి చూడు
57.ఓ నమో నమః యవ్వనమా - సూర్య ఐ.పి.ఎస్
58.రా రా నా సామి రా రా - విప్రనారాయణ
59.పూవై విరిసిన పున్నమి వేళ- తిరుపతమ్మ కథ
60.సావిరహెతవ దీనా రాధా- విప్రనారాయణ
61.రావె నా చెలియా  - మంచి మనసుకు మంచి రోజులు
62.సాగేను జీవిత నావ- తోబుట్టువు
63.రావే రావే వయరి ఓ చెలియా- కులదైవం
64.రాధను రమ్మన్నాడు - అర్థాంగి
65.రాక రాక వచ్చావు చందమామ- అర్థాంగి
66.సరసాల జవరలను- సీతారామ కళ్యాణము
67.శ్రీరామ నామాలు శతకోటి- మీన
68.తలనిండా పూదండ - ప్రైవేటు సాంగ్
69.రాజా నా రాజా ఇటు చూడవోయి - సారణాగదర
70.తోటాలో నా రాజు తొంగి చూసెను - ఏకవీర
71.సఖియా వివరింపవే - నర్తనశాల
72.తానే మారెనా గుణమే మారెనా- దెవదాసు
73.తొలివలపే పదే పదే పిలిచే - దేవత
74.సలలిత రాగ సుధారస సారం - నర్తనశాల
75. మదిలొ విరిసే తీయని రాగం - రెండు కుటుంబాల కథ
76. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి - లవకుశ
77. విరిసే చల్లని వెన్నెలా - లవకుశ
78. మనసార కల్యాణి పలికించు వీణ - వీరభార్కరుడు
79. కలిసిన హృదయాలలోనా - ప్రేమ - పగ
80. నీవేనా నను తలచినది - మాయబజార్
81. ఓ నా రాజా రావా రావా - ఆమె ఎవరు?
82. సరిసరి నటనల ఓ చెలి - మనోహరం
83. నీవే ఆది దైవము - భక్త తుకారాం
84. సుందరాంగ మరువలేనోయ్ - సంఘం
85.  ఇలలో సాటి లేని భారత దేశం - సంఘం
86. రాకరాక వచ్చావు చందమామ - అర్ధాంగి
87. ఆ మనసేమో .. ఆ సొగసేమో - రేచుక్క
88.రాధను రమ్మన్నాడు - అర్ధాంగి
89. నిఖిల భువన పాల - ఇలవేలుపు
90.పలుకవే రాణి కలవాణి - స్వర్ణమంజరి
91. కనుగవ తనియగ (హాయి హాయిగా  ఆమని సాగే) - సువర్ణ సుందరి
92. ఆ చూపులోనా ఆ మనసులోనా - పల్లెటూరు
93. చిరు చిరు నగవులు చిలికే తండ్రి - శ్రీవేంకటేశ్వర కల్యాణం
94. పూచే పూలలోనా వీచే గాలిలోనా - గీత
95. చక్కనైనా కోయరాజుని ఎక్కడేనా చూచేరా - జీవితం
96. ఇదియే జీవితానందము - స్వర్ణ మంజరి
97. దొరనో ఎవరినో - కథానాయిక మొల్ల
98. కలలు ఫలించే కాలములో (కనుల బెళుకు) - విమల
99. తలనిండ పూదండ దాల్చిన రాణి -ప్రవేట్ సాంగ్
100. బహుదూరపు బాటసారి - ప్రైవేట్ సాన్ 


 కల్యాణి రాగం లో హింది సినిమా పాటలు :


1. ఆప్ కి అనురోద్ పే - అనురోద్
2. ఆయే హో మేరి జిందగీ మే - రాజా హిందుస్తాని
3. అభి నా జావో చోడ్ కర్ - హం దోనో
4. అంగ్ అంగ్ రంగ్ చల్కె - సంకల్ప్
5. ఆసూ భరి హై యే జీవంకి రాహే -పర్వరిష్
6. ఆసు సమజ్ కర్ క్యూ ముఝే - ఛాయ
7. బడా దుఖ్ దియా తేరే లఖన్ నే - రాం లఖన్
8. బడే భోలే హొ - అర్ధాంగి
9. చందన్ స బదన్ - సరస్వతి చందెర్
10. ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్ - జంగిలి
11. ఘర్ సే నికల్ తే హి - పాపా కెహెతే హై
12. ఇణి లోగో నే - పాకీజా
13. ఇస్ మోడ్ సే జాతే హై - ఆంధి
14. జబ్ దీప్ జలే ఆనా - చిట్ చోర్
15. మన్ రే తూ కాహె న ధీర్ ధరే - చిత్ర లేఖ
16. మోసం హై ఆషికానా - పాకీజా
17. మేరే దునియా మే తూ ఆయే - హీర్ రాంజా
18. నిగాహే మిలానే కో జీ చాహతా హై - దిల్ హీ తో హై
19. పాన్ ఖాయే సయ్యా హమారో - తీస్రి కసం
20. సోచేంగే తుమే ప్యార్ కర్తే నహి - దీవాన
   




Sunday, September 11, 2016

జాతీయాలు

1. అక్కన్న మాదన్నలు : ఎన్నటికీ విడని అన్నదమ్ములు, స్నేహితులను అక్కన్న మాదన్నలుగా పేర్కొంటారు. 
అక్కన్న మాదన్నలు రామదాసు మేనమామలు, తానీష దగ్గర పనిచేసే మంత్రులు. ఇలాగే రాహుకేతులు, జంటకవులు, జయవిజయులు, సుందోపసుందులు అని కూడా అంటారు. 


2. అగ్గిమీద గుగ్గిలం : కోపముతో రగిలిపోవడము. 

 దీపావళి నాడు నూనేలో ముంచిన బట్ట ఒక పుల్లకి చుట్టి దానికి మైనాన్ని రాసి వెలిగిస్తారు. అది వెలుగుతూ ఉండగా పైన గుగ్గిలం వేస్తారు. అది చాలా ఎక్కువగా మండుతుంది. 


3. అగ్రతాంబూలం :
ఏవైన యాగాలకు, పూజలు పూర్తి అయ్యాక ఒక యోగ్యత కలిగిన వ్యక్తిని పూజించి  తాంబూలమిచ్చి సత్కరిస్తారు. అలా సభలో ప్రముఖులకు అగ్రతాంబూలమివ్వడమని అంటారు. క్షీరసాగరమధనములో మొదట హాలాహలము పుట్టినప్పుడు దాన్నీ స్వీకరించమని దేవతలు శివుడికి అగ్రతాంబూలమిచ్చినట్టు పోతనగారు చెప్పారు. 
ఆ తరవాత రాజసూయాగములో ధర్మరాజు  శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిచ్చి సత్కరించినట్లు మహాభారతములో పేర్కొంది. సభలో ప్రముఖలలో ముఖ్యులను గౌరవించడమే అగ్రతాంబూలము. 


4. అధః పాతాళం : తక్కువ స్థాయికి/ నీచ స్థాయికి  చేరడం.

భూమి కింద ఏడులోకాల్లో ఎంతో అడుగున ఉండే పాతాళంలో కూడా ఇంకా అడుగు భాగం.


5. అంధకరదీపిక (న్యాయం) : అశక్తుడు.
గుడ్డివాని చేతికి దీపం ఇస్తే ఎంత ప్రయోజనమో  అశక్తుడికి అవకాశమీయడము కూడా అంతే. 


6. అడవి కాచిన వెన్నెల : వృధా అవ్వడము. 
అడవిలో వెన్నెల కాచినా ఎవరికీ ఉపయోగము ఉండదు.  అలాగే వస్తువు(గుణము) ఉన్నా కూడా ఉపయోగపడకపోవడం. 


7.అగ్గి పగ  : నిప్పులాంటి దహించే కోపంతో కూడిన పగ. ఉద్దం సింఘ్ ఇందుకు చక్కని ఉదాహరణ, జలియన్ వాలాభాఘ్ లో చనిపోయిన తన మిత్రుల, బంధువుల శవాలను చూసి ఆ పగతో ఆ ఘాతకానికి కారకుడైన మైకేల్ ఓ డ్వయెర్ ని 21 సంవత్సరాల తరవాత కాల్చి చంపాడు. 


8.అగ్నిస్నాతుడు : అగ్నితో స్నానమాడిన వాడు అని అర్ధము. అంటే అగ్నిపునీతుడు. నిప్పులాంటి మనిషికి వాడే జాతీయము.  

9.అడుగంటింది : అయ్యిపోయింది, క్షీణించింది అని అర్ధము. 


10.అక్షింతలు వేయు: నిజముగా అక్షితలు వేయడం కాదు ఈ జాతీయము అర్ధము. తిట్టడానికి వ్యగముగా వాడే జాతీయము ఇది.  




11. అగ్నిపిండం(దుడుకుపిండం) : నీతి నిజాయితిలకు, స్వచ్చతకు  మారుపేరుగా నిప్పుని సూచిస్తారు. అలా ముక్కు సూటిగా వెళ్ళే వ్యక్తులకు ఈ జాతీయము ఉపయోగిస్తారు. కొంతమంది దరి చేరిన వారిని తమ ప్రవర్తనతోటి, మాటలతోటి బాధపెట్టే వాళ్ళకి కూడా ఈ జాతియము వాడుతారు. 

జాతీయాలు


జాతీయాలు - సామెతలు: మన నిత్య జీవితములో ఒక విషయాన్ని మరొక విషయముతో పొల్చేటప్పుడు  వాడే పదప్రయోగమే సామెత.. అంటే పోలిక. సామెత ఎక్కువగా ఒక వాక్యముగా ఉంటుంది. ఒక వ్యక్తికైన, ఆయా సందర్భమునికికేనా  పోలికను చెప్తూ ఉంటుంది.
సామాన్యంగా విడివిడిగా పొడిమాటలుగా ఉన్నవే, అపూర్వ సమ్మేళనంతో,  ఆ మాటలకు విడివిడిగా వేనికీ లేని ఏదో ఒక అపూర్వ భావ వ్యక్తీకరణకు మూలములై,  విశిష్ట పదబంధాలుగా భాషలో నిలిచిపోతున్నవి. వానినే పదబంధములనీ,  నుడికారములనీ,  పలుకుబడులనీ, జాతీయములనీ పేర్కొంటూ ఉంటాము. ఇవే కవితాలతాంకుర  ప్రధమాలవాలాలనీ  విజ్ఞులు భావిస్తారు. జాతీయాలు మారవు ఎప్పటినుండో ఉండేవి. సామెతలు మారుతూ ఉంటాయి.


జాతీయలు ఎక్కువగా పదబంధముగా ఉంటాయి. ఒక జాతికి సంబంధించిన విశిష్ట పలుకుబడి "జాతీయం, అందులో కనిపించే అర్ధము ఒకటి, నీగూఢార్ధము ఇంకొకటి. 


ఉదాహరణకు : కడుపులో మంట. ఈ జాతీయాము ఈర్షా అసూయలతో రగిలిపోతొనప్పుడు వాడే పదబంధము.