Search This Blog

Wednesday, April 25, 2018

నీవెంత నెరజాణవౌరా

  నీవెంత నెరజాణవౌరా...

ఈ రోజు మన "జావళి " జయభేరి సినిమాలోని "నీవెంత నెరజాణవౌరా " . ఈ పాట రాసినవారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. మొట్టమొదట చెప్పుకోవాల్సినది ఒక మగవాడిని పట్టుకొని "నెరజాణ " అని సంభోదించడం. మల్లాదివారి  గురించి ఎంత చెప్పినా తక్కువే! తెలుగు పాటలని "చిరంజీవులు " చేసిన కలం ఆయనది. 

 

ఆయన బహుభాషావేత్త. బహుముఖప్రజ్ఞాశాలి. ఈపాటకి సంగీత దర్శకులు పెండ్యాలగారు. నృత్య దర్శకులు "వెంపటి పెద సత్యం " గారు. ఈ పాట విని పెదసత్యం గారు మల్లది వారితో "పాట కాస్త సరి చెస్తే నాట్యానికి బాగుంటుందండి. ఇక్కడ కాస్త అడుగులకి ఇబ్బంది అవుతోంది " అని అన్నారుట. అందుకు మల్లాది వారు " మిగిలిన పాటంతా బానే ఉంది కదా? ఈ చిన్న చోటే కదా? ఆ ఒక్క చోట అంజమ్మ (అంజలీ దేవి) ని కాస్త తల గోక్కోమని చెప్పండి, అందంగా ఉంటుంది " అనేసి కండువా దులిపి భుజాన వెసుకొని వెళ్ళిపోయారుట. ఈ జావళి మాత్రం అంజలీదేవి మీద కాకుండా ఆ నాటి నాట్యతార "రాజసులోచన " పై చిత్రీకరించారు. 

 

 

చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లాది
నేపధ్య గానం : ఎం. ఎల్. వసంత కుమారి 



పల్లవి :


నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 


అనుపల్లవి :

తెనెలు చిలికించు గానము వినగానే...
తెనెలు చిలికించు గానము వినగానే... ఈ మేను పులకించురా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  



చరణం 1 :



చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...


సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ...
సిరిగన కనులాన.. సిగలో విరులానా
మౌనమే వినోదమా... ఇదే సరాగమా నవమదన


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  




చరణం 2 :



బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. స్వామీ
బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా..


మీరిన మోదాన వేమరు నిను వేడు
భామను వరించరా.. తరించరా...
శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా
సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా


వన్నె చిన్నె గమనించవేలరా... వన్నెకాడ కరుణించవేలరా
వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... నీ కొమ్మని.. నీ సొమ్మని
దరా పురంధరా.. యిదే మనవీ మన్నన సేయరా నాదమయా
మనవి వినర... మనసు పడర పరమ రసిక శిఖామణి...




నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 

 

 

 

8 comments:

  1. పాతకాలంలో ఐటెమ్ సాంగ్ లాంటిది బయ్యా జావలీ.

    ReplyDelete
    Replies
    1. హుందాగా ఉండే ఐటం సాంగ్స్ జావళీలు

      Delete
  2. గమనించారా “స్వరాల పల్లకి” అనే బ్లాగ్ లో నిన్న (25-04-2018) సుమారు అదే టైమ్ కి ఈ జావళీయే పోస్ట్ చేశారు? మీకూ, ఆ బ్లాగర్ కూ ఒకేసారి ఒకే ఆలోచన వచ్చినట్లుంది 🤙.

    ReplyDelete
    Replies

    1. Mr Sherlock Holmes :)


      జిలేబి

      Delete
    2. బ్లాగింగ్ కొత్తల్లో నేనూ, జాజిపూల బ్లాగర్ ఒకే రోజు ఒకే టైటిల్(అలిగిన వేళనే చూడాలి) అనే పోస్ట్ వ్రాసాం.ఇద్దరం ధ్రిల్లింగ్ గా ఫీలయ్యాం.నిన్ననే గుర్తుకువచ్చింది. మీరు అడిగేసారు.

      Delete
  3. మీరు ఇంకొక విషయం గమనించినట్టు లేదు, నేను పోస్త్ చేసిన విడియో "స్వరాల పల్లకి " దే! థాంక్స్ విన్నకోట నరసింహరావు గారు!!

    ReplyDelete