Search This Blog

Friday, November 23, 2018

పాటకలు

పున్నమి రాత్రిలో కూసే కోయిలలా ...

సముద్రపుటొడ్డున మేసే గోవులా..

కార్తీకాన విరబూసిన మల్లిలా...

నిత్యమూ ఆహ్లాదంగా నీ నవ్వు ఉంటుంది...


(రాత్రి పూట కోయిలా, సముద్రపు ఒడ్డున లేని గడ్డి మేసే ఆవు, కార్తీక మాసంలో మల్లెపువ్వు... దేవుడా)


నడిరోడ్డున ఏడుస్తొన్న ఆకాలి ఏడుపులు వినపడుతూ కూడా నువ్వు ఎలా తినగలుగుతున్నావు?


(అన్నం తినేటప్పుడు నాకు చెవులు పని చెయ్యవు)


పండక్కి నువ్వొక్కదానివే బట్టలు కొనుకుంటే చాలా... దేశంలో బట్టలు లేని వారు ఎందరో...

(పండక్కి కొత్త బట్టలు కొనికొని వెసుకోవడానికి కూడా కోర్టు అనుమతి కావాలా?)


ఇవన్నీ పొద్దుటే వచ్చే వాట్స్ ఆప్ లో కవితా సందేశాలు...కవితలనబడే ముక్కలు చేసేసిన వాక్యాలు.


ఇంకొందరు పాత పాటలలో అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసుకొని అతికించేసి రాసేస్తూ ఉంటారు. అప్పటికే మనసు చంపుకొని "వహ వా.. " అన్నాను... 


అన్నకా ఇంకా పెట్రేగి పోయి..."గంగాభగీరథి సమానురాలైన మా అమ్మ నిత్య పవిత్రురాలు " అంటూ రాసేశారు.. వాళ్ళ నాన్న గుండ్రాయిలా ఉన్నాడు. ఇలా అనకూడదు భర్త ఉన్న వాళ్లని అంటే "పద ప్రయోగం బాగుందని అనేశా... " అంటూ సకిళింపు లాంటి ఇకిలింపు...


రేపటి నుంచి రివర్స్ లో నేనూ పాటల ముక్కలు కవితలుగా .. అంటే "పాటకలు "  (అబ్బాబ్బ ఎంత బాగుందో పేరు) రాసేసి పంపేస్తా.. అంతే!!