నాకు ఇష్టమైన వ్యాసాలు, నేను పత్రికలకు వ్రాసిన వ్యాసాలు, కొన్ని పిచ్చాపాటి విషయాలు పొందుపరచుకున్న అందమైన "ఊహల కుటీరం " ఇది.
Search This Blog
Saturday, September 23, 2017
సంపెంగ
నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్
సంపెంగ పువ్వు తన మీద తుమ్మెదలు వాలటంలేదని బాధపడి తపస్సు చేసిందిట, ఆ తపస్సుకి ఫలితంగా ఎప్పుడూ తుమ్మెదలని(నల్ల తుమ్మెదలను) తన తో కట్టిపరేసుకొనేలా 'గిరికా దేవి " ముక్కుగా మారిందిట!
ఈ పద్యం వసుచరిత్రలోనిది, వ్రాసినది ముక్కుతిమ్మన. ఈ పద్యం రాసినందుకే ఆయనకు "ముక్కు " అన్న బిరుదు తగిలించారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పద్యాన్ని రామరాజభూషణుడు నాలుగు వేల వరహాలిచ్చి కొనుకున్నాడన్న ప్రచారమూ ఉంది. కానీ రామరాజు భూషణూడికి ఇంకొకరి పద్యాలు సంగ్రహించేతంట అవసరం లేదని కొంతమంది విజ్ఞులు అంటూ ఉంటారు.
( ఏది ఏవైతే మనకెందుకు? పద్యం సంపెంగిపువ్వంత సువాసనతో కూడుకొని ఉంది.. దాన్నీ ఆస్వాదిద్దాం అంతే! :)
ఒకసారి తంగిరాల సుబ్బారావుగారిని కలిసినప్పుడు అడిగాను ఇంతకీ ఆవిడ (గిరికాదేవి ) ముక్కు ఏ సంపెంగతో పోల్చారని. ఎందుకంటే నాకు తెలిసిన సంపెంగలు "బుట్ట సంపెంగ, ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, కోడుగుడ్డు సంపెంగ " ఉన్నాయి. అప్పుడాయన "సింహాచలం సంపెంగలా ఉండే తెల్లటి సంపెంగతో ఆవిడ ముక్కుని పోల్చరని " చెప్పారు.
ఈ సంపెంగకి " చంపకము, చనుపకము, చాంపేయము, దీపపుష్పము, పచంపచము, పీతపుష్పము, భ్రమరాతిథి, సంపంగె, సంపెంగ, సురభి, స్థిరగంధము, స్థిరపుష్పము, హేమపుష్పము " అన్న పేర్లు ఉన్నాయి.
లలితా సహస్రనామాలలో అమ్మవారిని "చాంపేయకుసుమ ప్రియ " అని స్థుతిస్తారు. అంటే ఆవిడకు సంపెంగి పూలంటే ఇష్టమన్న ఒక అర్ధం.
"చాంపేయం " అంటే బంగారము అనే ఇంకో అర్ధం ఉంది. అంటే ఆవిడకు "బంగారు పూలంటే ఇష్టమని " అనుకోవచ్చు.
అదీ కాక బంగారు వర్ణం గల పులన్నా ఇష్టమన్న అర్ధమూ
ఉంది.
ది.
అమ్మవారి కొప్పుని వర్ణించినప్పుడు " చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా " , ఆవిడ కొప్పుచంపకమూ(సంపెంగ), అశోకము, పున్నాగపూలతో నిండి ఉందీ. ఏ స్త్రీయేనా శిరోజాలకు మంచి సువాసన కలగాలని కొప్పులో పూలు తురుముకుంటుంది, కానీ అమ్మవారి కొప్పులో పూలు మాత్రం ఆవిడ శిరోజాల వాసన గ్రహించడానికి చేరుకున్నాయిట.
సంపెంగపువ్వు గిరికాదేవి ముక్కు ఐతే, మరి ఆ నల్ల తుమ్మెదలేంటో తెలుసునా? గిరికాదేవి కళ్ళు. కళ్ళెప్పుడూ ముక్కు పక్కనే ఉంటాయి కదా, వదిలి వెళ్ళలేవు కదా, అలా సాధించుకుందన్న మాట సంపెంగపువ్వు తన పంతాన్ని.
for Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in
ReplyDeleteబాగుంది!
ReplyDeleteతిమ్మనగారి అసలు పేరు నంది తిమ్మన ఆ తరవాతే ముక్కు తిమ్మన అయ్యరంటారు,పౌరుషనామమా? :) ముద్దు పేరో !
శ్రీమాత్రేనమః
సంపెంగపువ్వు గిరికాదేవి ముక్కు ఐతే, మరి ఆ నల్ల తుమ్మెదలేంటో తెలుసునా? గిరికాదేవి కళ్ళు. కళ్ళెప్పుడూ ముక్కు పక్కనే ఉంటాయి కదా, వదిలి వెళ్ళలేవు కదా, అలా సాధించుకుందన్న మాట సంపెంగపువ్వు తన పంతాన్ని.
ReplyDeleteబాగా చెప్పారండీ
Delete