Search This Blog

Friday, July 28, 2017

తుం ఆగయే హో....

పెనం మీద వేడి వేడి పెసరట్టు నోరూరిస్తోంది! తినాలని ఉంది కానీ... తనతో పాటు తింద్దామని ఒక ప్లేట్ లో తనకి రెండు, నాకు ఒకటి ఉంచాను. నిన్న కూడా అంతే... తనకి నా చేతి ఇడ్లీలంటే ఇష్టమని, నేను తినకుండా తన కోసం వైట్ చేసి చివరకి రాత్రి ఆ చల్లారిన ఇడ్లీనే తిని ఉన్నాను. నేనే తన గురించి ఇంత ఆత్రము పడాలి కానీ, అసలు తనకి నేను గుర్తొస్తానా? వెళ్ళి పదిహేను రోజులయ్యింది, ఒక్క సారైనా ఫోన్ చేస్తే కదా! నేను చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేం మనిషో! కాసంత అభిమానం కూడా లేదు! రోజు తనతోటే టీ తాగే అలవాటు, టీ తాగుతొన్నంత సేపు ఎన్ని కబుర్లో! ఏంటో ఇప్పుడు ఒక్కదాన్నే తాగుతోంటే చాలా వెలితిగా ఉంది. తను వచ్చాక కొన్ని రోజులు మాట్లాడకూడదు. ముభావంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అలుసు అయ్యిపోతాను! తనకిప్పుడు వాళ్ళ వాళ్ళతో టైం పాస్ అవుతుండవచ్చు, నాకే అంతా శూన్యం గా ఉంది లైఫ్!  😞

 

" తెరే మేరే హోటో పే మీటే మీటే గీత్ మిత్వా " అని కాలింగ్ బెల్! ఒకప్పుడు కాలింగ్ బెల్ "డింగ్ డాంగ్ " అని మ్రోగేవి. అదేంటో ఇప్పుడు పూర్తి పాటలు. ఏం "మీటే మీటే గీత్" వినిపిస్తుందో వచ్చి! ఈ పాట హిందిలో "చాందిని " సినిమాలోది. ఇదే డబ్బింగ్ కూడ అచేస్తే మా క్లాస్ లో ఒక తుంటరి "నీకీ నాకి పెదవులలో తియ్య తియ్యని పాటలే ప్రియా " అని మక్కికి మక్కి అనువాదం చేసింది. ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఆ తెలుగు పారెడి గుర్తొస్తుంది! 😋


తనేమో అని ఆత్రంగా వెళ్ళి చూస్తే పక్కింటావిడ! ఆవిడ ఎందుకొచ్చిందో అర్ధమయ్యింది. కాస్త కాఫీ చేసి ఆవిడకో గ్లాస్, నాకో గ్లాస్ తెచ్చుకొన్నా! ఏవేవో కబుర్లు చెబుతోంది. "ఇంకా తను రాలేదా? " అని అసలు ప్రశ్న వేసేసింది. కళ్ళలో నుంచి ఉబుకి వస్తోన్న నీటిని ఆపుకొని.. "లేదండి " అని ఏదో పనునట్టు వంటింట్లోకి వచ్చేశా! 😢😢ఆవిడ తన గురించి కనుకోడానికే వచ్చింది. కాఫీ తాగి కాసన్ని ఊసుబోని కబుర్లు చెప్పి వెళ్ళింది.


టైమ్ పదయ్యింది... ఇంక ఈ రోజు తను వచ్చే అవకాశాలు తక్కువే! ఇంక తప్పద్దు.. తినాలి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా... వంటింట్లోకి తప్పనిసరై వెళ్ళాను. "ఏం వండాలి? ఏదో సింగిల్ ఐటమ్ చేసేసుకుంటా! ఆకలి తీరాలి అంతే! " రుచుల మీద మనసు వెళ్ళడం లేదు! గత పదిహేనురోజూల నుండి తినాలి కాబట్టి తింటున్నాను! కాళ్ళు ఒళ్ళు ఒకటే నొప్పి... తను రాగానే ఈ విషయం కూడా చెప్పాలి... ఈ నొప్పులకు కారణం తనేనని!!! 😞😔


మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది... " తుం ఆగయే హో నూర్ ఆగయా హై " . మనసులో ఏదో మూల చిన్న ఆశ, అదే ఆశతో తలుపు తీశా!


"తనే "... నిజమే తను రావడమే నా ఇంటికి నూర్ వచ్చింది. మరే నా ఇంటికి దీపం తనేగా... అబ్బా.. వసంతం వచ్చినంత ఆనందంగా ఉంది! 😍😍😍😍


"రా లక్ష్మి " అంటూ సాదరంగా ఆహ్వానించాను.. మా ఇంటి పనిమనిషిని! (బెట్టు చేసి మాట్లాడకపోతే... మళ్ళీ మానేస్తుందన్న భయంతో)!!  😀

Saturday, May 27, 2017

మాయామయి

నా టెంత్ క్లాస్ అయ్యాక బోలెడు వేసవి శెలవలు వచ్చాయి. అప్పుడు ఇంట్లో ఉన్న చందమామలు, బాలరంజని, మాయదారి ముసలమ్మ మొదలైన చిన్న చిన్న పెద్ద కథల పుస్తకలన్నీ చదివేశాను. మా నాన్నగారు అప్పుడు నాకు "మాయమయి " అని ఒక పుస్తకం ఇచ్చారు. అది 10 భాగాలు. మొదటి రెండు భాగాలు వీరేంద్ర సింహుడు (తేజసింహుడు, దేవీసింహుడు అనుచరులు), చంద్రకాంత (చపల, చంప అనుచరులు) వీరోచితమైన కథ. వారు ఒక నిధిని ఛేదించడం కథ సారాంశం. ఆ తరవాత ఎనిమిది భాగాలు ఆ చంద్రకాంత సంతతి అయిన ఇంద్రజీత్ సింహుడు, ఆనంద సింహుడు కథలు. వారి స్నేహితులు భైరవ సింహుడు, తారా సింహుడు. ఈ నవల వ్రాసినది బెంగాళి రచయిత 'భోలానాథ్ ' . 'గోరా ' నవల రాసినప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ ఆ నవలలో నాయకుడి తెలివితేటలని వర్ణిస్తూ ఆ యువకుడు 'భోలానాథ్ ' అంత తెలివైనవాడు అని భోలానాథ్ ని కీర్తించాడు. ఆ కథలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ప్రతీ పాత్ర ముఖ్యమైనదే! చదివిన వాళ్ళము ఒకవేళ ఆ పాత్ర గురించి మరచిపోతే రచయితే గుర్తు తెచ్చేవారు ( "ఫలాన చోట ఆ పాత్ర వచ్చింది మీకు గుర్తుంది కదా అని) . ఈ నవలని తెలుగులో అనువదించినవారు బొందలపాటి శివరామకృష్ణయ్య, శకుంతల గార్లు.

 


అప్పుడు ఆ కథ చదువుతున్నప్పుడు ఏదో లోకంలో విహరించేదాన్ని. నేనే కాదు మా ఇంట్లో ఈ కథ ఎవరు చదివినా ఆ మాయమయి 'మాయ ' లో ఉండేవాళ్ళము. భోజనానికి రాకుండా పొలానికి వెళ్ళి మా అత్తయ్యలు, బాబయ్యలు ఈ కథ చదువుతూ ఉంటే మా చినమామ్మ గారు ఈ పుస్తకం ఇచ్చినందుకు నా నాన్న గారిని తిట్టేవారు. ఆ నవలలో 'దేవ్ ఘడ్ ' 'విజయ్ ఘడ్ ' నగరాల వర్ణన చదివినప్పుడు, ముఖ్య కథానాయిక అయిన 'కమిలిని /లాడిలి ' పరాక్రమము అందం చదివినప్పుడు రొమాంచితమైపోయేవాళ్ళము. ఒకసారి అనుకున్నాము కూడా "ఈ నవల సినిమా తీస్తే ఎలా ఉంటుంది " అని. మళ్ళీ మేమే అనుకున్నాము " అంత గొప్ప నవల సినిమా తీయగలరా? అంత సాహసం చేయడం చాలా కష్టం " అని.

 

కానీ ఈ మధ్య 'బాహుబలి " లో అనూష్క విలు విద్య, మాహిష్మతి సామ్రాజ్యం చూపించిన తీరు చూశాక మాయామయి గుర్తుకొచ్చింది. ఆ సినిమాలోని యుద్ధ నైపుణ్యాన్ని చూపించిన తీరు అవన్నీ మాయామయిలో వర్ణించినవే! రాజమౌళి గారి ఈ సినిమాకి స్ఫూర్తి ఏదైనా కావొచ్చు... కానీ మా 'మాయా మయి " మా కళ్ళకు చాలా ఏళ్ళ తరవాత కనిపించింది.

 

 

 

Monday, September 12, 2016

హిందోళ రాగం

                           



శాస్త్రీయ సంగీతము ఇరవైయ్యోవ మేళకర్త నఠభైరవి. ఆ నఠభైరవి రాగానికి జన్యరాగము ఈ హిందోళ రాగము.  


ఆరోహణ: స మ గ మ ద ని స

అవరోహణ:  స ని ద మ గ స



హిందోళం వొక విలక్షణమైన రాగం.  సంగీత జ్ఞానం లేని వారు సైతం ఈ రాగంలో స్వరపరిచిన పాటలను వింటే పారవశ్యంతో తలలూపాల్సిందే. ఈ రాగంలోని పాటలు వింటే జీర్ణ కాలేయ సంబంధమైన వ్యాధులు నిదానిస్తాయిట.  


హిందోళ రాగములో ఉన్న కొన్ని ప్రముఖ కీర్తనలు :



సామజ వరగమన - త్యాగయ్య
మనసులోని మర్మమును తెలుసుకో - త్యాగయ్య
మమవతుశ్రీ సరస్వతి - మైసూర్ వాసుదేవాచార్య
మనసులోని మర్మమును తెలుసుకో - త్యాగయ్య
నీరజాక్షి కామాక్షి -
సామగాన లోలనే  సదా శివ శంకరనే
కొండలలో నెలకొన్న కోనేటి - అన్నమాచార్య
దేవదేవం భజే - అన్నమాచార్య
భామనే సత్యా భామనే - యక్షగానము
కట్టెదుట వైకుంఠము - అన్నమాచార్య
గరుడ గమన - అన్నమాచార్య
నిగమా నిగమాంతర వర్ణిత - అన్నమాచార్య 


ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :



*  శ్రీకర కరుణాలవాల - బొబ్బిలి యుద్ధం
* చూడుమదే చెలియా - విప్రనారాయణ
* మూగవైన ఏమిలే - అప్పుచేసి పప్పు కూడు
* మనమే నందన వనమే గదా - మా ఇంటి మహాలక్ష్మి
* వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ - పరమానందయ్య శిష్యుల కథ
* పతియే ప్రత్యక్ష దైవమే - ఆమె కథ
* అందాలు చిందెడి ఆనంద సీమ - చింతామణి
* శ్రితజనపాల - దేవంతకుడు (పాతది)
* మధురమైన గురు దీవెన - స్వర్ణ మంజరి
* నన్ను వదిలి నీవు పోలేవులే - మంచి మనసులు
* సందేహించకుమమ్మా- లవకుశ
* కలనైనా నీ తలపే - శాంతినివాసం
* నారాయణా హరి నారాయణా - చెంచులక్ష్మి
* పగలే వెన్నెలా - పూజాఫలం
* శ్రీకరమగు పాలన నీదే - మహాకవి కాళిదాసు
* నేనే రాధనోయీ - అంతా మన మంచికే
* పిలువకురా అలుగకురా - సువర్ణ సుందరి
*  ఓహో మోహన రూపా గోపాలా - శ్రీకృష్ణ తులాభారం
* మనసే వికసించెనే - అమరశిల్పి జక్కన
* దేవదేవ పరంధామ - సీతా రామ కల్యాణం
* వీణ వేణువైన సరిగమ -ఇంటింటి రామాయణం
* అభినందన మందార మాల - తాండ్రపాపారాయుడు
* కొత్త కొత్తగా ఉన్నది - కూలీ నెం.  1
*  ఏం వానో ముసురుతున్నది - నారీ నారీ నడుమ మురారి
*  మనసులోని మర్మమును తెలుసుకో - నారీ నారీ నడుమ మురారి
* రాజశేఖరా నీపై మోజు తీరలేదురా- అనార్కలి
* జయవాణి కమల చరణ - మహామంత్రి తిమ్మరుసు
* గిరిజా కల్యాణం (సాగమ సాగమ ) - రహస్యం
* క్షితి రితి విపుల తలే - భక్త జయదేవ
* లక్ష్మీ వల్లభ దీన శరణ్య  - భక్త ప్రహ్లాద
* కలనైనా నీ వలపే - శాంతి నివాసం
* అందమె ఆనందం - బ్రతుకు తెరువు
* రామ కథను వినరయ్యా - లవకుశ
* మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం
*  సాగర సంగమమే ప్రణయ…- సీతాకోక చిలుక
* రారా.. స్వరముల సోపానమునకు - సంకీర్తన
*  మావి చిగురు తినగానే - సీతామాలక్ష్మి
* స్వరములు ఏడైనా  - తూర్పు - పడమర
*  ఆడవే అందాల సురభామిని - యమగోల
* రంగులలో కలవో - అభినందన
* ఓం నమఃశివాయ - సాగర సంగమం
* పాడాలనీ ఉన్నది - చిళ్ళర దేవుళ్ళు
* నిగమా నిగమాంతర వర్ణిత - అన్నమయ్య
* దయ చూపవే గాడిదా - జాతక రత్న మిడతంబొట్లు
* గున్నమామిడి కొమ్మ మీద - బాల మిత్రుల కథ
* నమ్మకు నమ్మకు ఈ రేయిని - రుద్ర వీణ
* చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ - నీ స్నేహం
* పొడగంటినయ్యా నిన్ను పురుషోత్తమా - అన్నమయ్య
* వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట - గంగోత్రి
* గుప్పెడు గుండెను తడితే - బొంబాయి ప్రియుడు
* ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి - స్తూడెంట్ నెం.  1
* కాస్త నిన్ను నేను నన్ను నువ్వు తాకుతుంటే - స్తూడెంట్ నెం. 1
*  దైవం మానవ రూపంలో - శ్రీశిరిడి సాయి మహత్యం  
*  బలపం పట్టి భామ బళ్లో - బొబ్బిలి రాజా
* పాహీ త్రిలోకైక జనని - కనక దుర్గ మహిమ
* ముసిన ముత్యాలకేలే - అన్నమయ్య
* పాడనా శిలను కరిగించు గీతం - శీను వాసంతి లక్ష్మి
* బాలమురళి కృష్ణ నాకు బాల్య మిత్రుడే - బొంబాయి ప్రియుడు
*  ముసిముసి నవ్వుల లోనా - బ్రహ్మ



 హిందుస్తానీ సంగీత సంప్రదాయంలో దీని పేరే మాల్కోస్.  


ఈ రాగములో ఉన్న కొన్ని హింది పాటలు : 


* ఆయే సుర్ కే పంచి - సుర్ సంగం

* ఆధ హై చంద్మా రాత్ ఆధి - నవ్ రంగ్
* తూ చుపి హై కహా - నవ్ రంగ్
* అఖియ సంగ్ అఖియ లగి - బడే ఆద్మి
* దీప్ జలాయే జో గీతోంకి  - కలాకార్
* జానే బహార్ హుస్న్ తెరా - ప్యార్ కియా తో డర్న క్యా
* మన్ తరపత్ హరి దర్శన్ కో - బైజు బావ్రా
* ఏ మాలిక్ తేరే బందే హం - దో ఆఖే బారహ్ హాత్
* మన్ మోహనా పియా తూ జో మిలే - ఫూల్ కా సేజ్
* జానే వాలే ఓ మేరా ప్రాణ్ - గీత్ గాయా పత్తరోనే
* దేఖో చం చం గుంగురూ బోలే - కాజల్
* మెరే బహిస్ కొ దండా క్యూ మారా - పగ్లా కహి కా
* ఖలియో కి గూంఘట్ - దిల్ నె ఫిర్ యాద్ కియా


కాఫీ రాగము




శాస్త్రీయ సంగీతములో ఇరవైరెండొవ  మేళకర్త రాగము ఖరహరప్రియ.  ఖరహరప్రియకు జన్య రాగలలో ఒకటి 'కాఫీ " రాగము.  


ఆరోహణ :  S R g m P D n s


అవరోహణ :  s n D P m g R S 




ఈ రాగములో ఉన్న కొన్ని ప్రసిద్ధి చెందిన కొన్ని కీర్తనలు : 



వందేమాతరం, వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ రచించిన భారత జాతీయగేయం.
అతడే ధన్యుడురా.. ఓ మనసా - త్యాగరాజు కీర్తన
అన్యాయము సేయకురా రామ - త్యాగరాజు కీర్తన
పావన రామ నామ సుధారస పానము జేసేదెన్నటికో - రామదాసు కీర్తన
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి - రామదాసు కీర్తన
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము - రామదాసు కీర్తన
జానకి రమణ కళ్యాణ సజ్జన - రామదాసు కీర్తన



'కాఫీ " రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు ...




*  ఓం నమశివాయ నవనీత హృదయ - శ్రీకాళహస్తి మహత్యం
*  జయమంగళ గౌరీ దేవీ- ముద్దు బిడ్డ
* దేవ దేవ ధవలాచల - భూకైలాస్
* పిలిచిన బిగువటరా - మల్లీశ్వరి
* కోతీబావకు పెళ్ళంట - మల్లీశ్వరి
* ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ - శ్రీవేంకటేశ్వర మహత్యం
* నీకై వేచితినయ్య - శ్రీకృష్ణార్జున యుద్ధం
* యమునా తీరమున ( పూపొదలో దాగెనేల ) - జయభేరి
* ఎవడే అతడెవ్వడే - విప్రనారాయణ
* కామిని మదన రారా - పరమానందయ్య శిష్యుల కథ
* లాలీ లాలీ కను కన్నయ్య - పెద్దరికాలు
* తగునా వరమీయా - భూకైలాస్
* వద్దురా కన్నయ్య - అర్ధాంగి
* హైలో హైలెస్స హంస కదా నా పడవ - భీష్మ
* నేను తాగలేదు - మనుషులు - మమతలు
* ఆది లక్ష్మివంటి అత్తగారివమ్మ - జగదేకవీరుని కథ
* హాయిగా ఆలుమగై కాలం గడపాలి - మాంగల్యబలం
* ఓ సుకుమార నిను గని మురిసితిరా - సీతారామ కల్యాణం
* నలుగురు నవ్వేరురా - విచిత్ర దాంపత్యం
* అందాల బొమ్మతో ఆటాడవా - అమరశిల్పి జక్కన
* ఎవరురా.. నీవెవరురా - అగ్గి రాముడు
* ఏ పంచెవన్నెల చిలక - అప్పుచేసి పప్పు కూడు
* ఔనంటే కాదనిలే - మిస్సమ్మ
* వెన్నెల్లో గోదారి అందం - సితార
* జో అచ్యుతానంద - అన్నమయ్య
* ఏమివ్వగలదానరా - వసంత సేన
* మన మనసు మనసూ ఏకమై - జీవితం
* నీలాల కన్నుల్లో మెల మెలగా - నాటకాల రాయుడు
* ఓహో బస్తీ దొరసాని - అభిమానం
* ఓ మరదలా మదిలో పొంగే వరదలా - అప్పు చేసి పప్పు కూడు
* ప్రళయపయోధి జలే - భక్త జయదేవ
* నడుమెక్కడే నీకు నవలామణి - కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
* నవరససుమ మాలిక - మేఘసందేశం
* తెల్లారే దాక నువ్వు తలుపు మూసి తొంగుంటే - ప్రేమ పక్షులు
* కొంటె చూపులెందుకులేరా - శ్రీమంతుడు
* అలలైపొంగెరా - సఖి
* ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను - నువ్వు లేక నేను లేను
* నే తొలిసారిగా కలగన్నది - సంతోషం
* చీకటి వెలుగుల కౌగిటిలో ( గల గలమనకూడదు ) - చీకటి వెలుగులు
* ఎక్కడమ్మా చంద్రుడు  - అర్ధాంగి
* ప్రభు గిరిధారి - పరువు-ప్రతిష్ట
* ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నెవయసు
* నా చెలి రోజావే - రోజ
* పిల్లనగ్రోవి పిలుపు - శ్రీకృష్ణ విజయం
* ఓ సుకుమార నిను గని మురిసితిరా - సీతారామ కల్యాణం
* హరి ఓం .. భజగోవిందం - రాజా రమేశ్
* ఆరనీకుమా ఈ దీపం - కార్తీక దీపం
* వటపత్రశాయికి - స్వాతి ముత్యం
* చందమామ కంచమెట్టి - రామబంటు
* చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటి - వారసత్వం
* మన్సున ఉన్నదీ చెప్పాలనున్నది - ప్రియమైన నీకు






ఈ రాగములో ఉన్న హింది సినిమా పాటలు  : 


* ఏ దినియా క్యా తుఝ్ సే కహే - సుహాగ్
* బిరజ్ మే హోలి ఖేలత్ నంద్ లాల్ - గోదాన్
* బైరనా నీంద్ నా ఆయే - చాచా జిందాబాద్
* కైసే కహూ మన్ కి బాత్ - ధూల్ కా ఫూల్
* తేరే భీగి బదన్ కి కుష్బూ సే - షరాఫత్
* తుమ్హారే ప్యార్ చాహియే ముఝే - మనోకామ్నా
* యే రాత్ యే చాంద్నీ - జాల్
* ఆ అబ్ లౌట్ చలే - జిస్ దేశ్ మే గంగా బెహతీ హై
* సఖి కైసే ధరన్ మైన్ ధిర్ - సంగీత్ సామ్రాట్ తాన్సేన్
* ఏక్ దాల్ పర్ తోతా భోలే ఏక్ దాల్ పర్ మైనా - చోర్ మచాయా షోర్
* కస్మే వాదే ప్యార్ వఫా - ఉప్కార్
* ధీరే ధిరే భోల్ కోయి సున్ నా లే - గోరా ఔర్ కాలా
* దునియా బదల్ గయి - బాబుల్
* షర్మాకే యహ అకోయి - చౌద్ వి కా చాంద్
* మై తేరే ప్యార్ మే క్యా క్యా - జిద్ది
* భవర బడా నాదాన్ హై- షాహిబ్ బీవి ఔర్ గులాం



కీరవాణి




కీరవాణి రాగము కర్ణాటక సంగీతంలో 21వ మేళకర్త రాగము. కీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి.



ఈ రాగం లోని స్వరాలు చతుశృతి ఋషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము. ఈ రాగము రాత్రి వేళలలో వినదగిన రాగము. 


ఆరోహణ :  స రి గ మ ప ద ని స


అవరోహణ : స ని ద ప మ గ రి స  


కీర్తనలు :



అంబా వాణి నన్నాదరించవే - హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్


కలికియుండే - త్యాగరాజ స్వామి


కలిగియుంటే కదా - త్యాగరాజ స్వామి 


శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే గురువరం  -  




ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :



* ఓహోహో పావురమా - స్వర్గ సీమ
* వల్లభాప్రియ వల్లభ - శ్రీ శ్రీకాకుళపు ఆంధ్ర మహా విష్ణువు కథ
* వినుడు వినుడు రామాయణ గాధ - లవ కుశ
* జలకాలాటలలో - జగదేక వీరుని కథ
* గజ్జా ఘళ్లుమంటూంటే - సిరిసిరిమువ్వ
* కొంటె చూపులెందుకు లేరా జుంటి తేనె అందిస్తారా - శ్రీమంతుడు (పాతది)
* ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా - విప్రనారాయణ
* కనుపాప కరవైన కనులెందుకో - చిరంజీవులు  
* కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే - అన్వేషణ
* తాళి కట్టు శుభవేళ - అంతు లేని కథ
* రండి రండి రండి దయచేయండి - రుద్రవీణ
* ఎన్నెన్నో అందాలు - చంటి
* ఓ ప్రేమా నా ప్రేమా - చంటి
* ఊరుకో హృదయమా - నీ స్నేహం
* ముత్యాల చమ్మ చెక్క ముగ్గులేయంగా - మువ్వా గోపాలుడు
* ఓ పాపా లాలి జన్మకే లాలి - గీతాంజలి
* కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెల్లా - కొండవీటి దొంగ
* ఓ ప్రియా ప్రియా - గీతాంజలి
* అరె ఏమయ్యింది - ఆరాధన
* ఎదలో లయ ఎగసే లయ - అన్వేషణ
* పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి - నువ్వొస్తావని
* ఇలలో జరిగే శిధిలాకాశము - అన్వేషణ
* ఎదుటా నీవే... - అభినందన
* సిరిమల్లె పువ్వా - పదహారేళ్ల వయసు
* నిండు నూరేళ్ళ సావాసం - ప్రాణం
* నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా - సంతోషం
* కోకిల.. కోకిలా కోకిలా - కబడి కబడి
* కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం - స్వయంవరం




ఈ రాగములో ఉన్న కొన్ని హింది పాటలు :

( ఓ.పి. నయ్యర్ స్వరపరచిన చాలా పాటలు ఈ రాగములో ఉండటం విశేషం).. 


* యాద్ నా జాయే బీతే దినోకా - దిల్ ఏక్ మందిర్
* గీత్ గాతా హు మై గున్ గునా  తా హు మై - లాల్ పత్తర్
* ఆజా సనం మధుర్ చాంద్ని మే హుం - లవ్ మారేజ్
* దిల్ కి గిరహ్ ఖోల్ దో - రాత్ ఔర్ దిన్
* సున్ చంపా సున్ తారా - అప్న దేష్
* మేరి భీగి భీగి సి - అనామిక
* ఆనే వాలా పల్ జానేవాలా హై - గోల్ మాల్
* తుం బిన్ జావు కహా - ప్యార్ కా మోసం
* మై ప్యార్ క రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీన్
* పుకార్తా చలా హూ మై - మేరే సనం
* ఆఖో సే ఉతర్ తి హై దిల్ మే - ఫిర్ వొహీ దిల్ లాయా హు
* ఆవో హుజూర్ తుంకో - కిస్మత్
* యే హై రేష్మి జుల్ఫే - మేరే సనం
* ఎక్ పర్దేసి మేరా దిల్ లే గయా - ఫల్గున్
* కిత్నే ఖలి కిలే హై చమన్ మే - చించినాతి బబ్లో బూ
* తుం క్యా జునూన్ తుమ్హార యాద్ మే - చించినాతి బబ్లో బూ
* దుఖి మన్ మోరే .. సున్ మెరే కెహనా - ఫంతోష్
* చల్ దియా కర్వాన్ - లైలా మజ్ఞు
* తుంభీ చెలో .. హుంభీ చెలే - జమీన్
* సప్నో మే ఆనా దిల్ మే సమానా - చోర్ అఊర్ చాంద్
* ఓ పియా పియా - డాకు ఔర్ ఇన్సాన్
* శుభహ్ నా ఆయి షాం నా ఆయి - ఛ ఛా ఛ
* రూప్ రంగ్ సే మర్తా ఆయా - శిక్ష
* యే సమా .. సమా హై ఏ ప్యార్ కా - జబ్ జబ్ ఫూల్ ఖిలే
* మామా కల్లు మామా - సత్య
* తుం హవా హై.. తుం ఫిజా హై - ఫిజా
* చార్ దిన్ బహార్ కే - రుక్సానా
* మెర దిల్ యే పుకారే ఆజా - నాగిన్
* తుమ్హార ప్యార్ చాహియే - శిక్ష
* తుమ్హి మేరి పూజా హో - సుహాగ్
* తూ బేమిసాల్ హై తారీఫ్ క్యా కరూ - బ్రహ్మచారి
* పర్బత్ కే ఇస్ పార్ - సర్గం
*  మై గావూ తుం సోజావో - బ్రహ్మచారి
* కణయ్య తేరి మురళి - న్యూ ఢిల్లి
* కల్ కి దౌలత్ ఆజ్ కి ఖుషియా - అస్లి నక్లి
* రింజిం గిరే సావన్ - మంజిల్
* తూ ప్యార్ క సాగర్ హై - సీమ 


శివరంజని

ఒకసారి శివుడు మోహినిని చూసి ముచ్చటపడి ఆమె వెనక బయలుదేరాడుట. అప్పుడు ఆ మోహిని ఒక ఉద్యానవనం లో ఒక రాగములో ఆలపిస్తూ ఉంటుంది. ఆ రాగము శివుడిని రంజింప చేసింది. శివుడినిరంజింప చేసింది కాబట్టి ఆ రాగము  అప్పటి నుంచి '  శివరంజని ' రాగముగా ప్రశిద్ధికెక్కింది. 




శివరంజని రాగము ఖరహరప్రియ రాగానికి జన్యరాగము. ఈ రాగములో ఆరోహణ అవరోహణలలో ఐదు స్వరాలు మాత్రమే ఉపయోగిస్తారు.... కాబట్టి ఇది ఔడవ రాగం. కరుణ, విషాదానికి ప్రశిద్ధి ఈ రాగము. హిందూస్తానీ శివరంజని రాగానికి, కర్నాటక సంగీతంలో ఏడు స్వరాలు ఉన్న శివరంజని రాగానికి ఎటువంటి సంబంధము, పోలికలు లేవు.



ఆరోహణ :   స రి గ ప – ద – స (పై షడ్జమం) 


అవరోహణ: స (పై షడ్జమం) ధ ప – గ స్ – రి స స్


పకడ్ స్వరాలు ఈ విధంగా ఉంటాయి...


గ ప ధ స (పై షడ్జమం) – ధ ప – గ స్ రి – స


సినిమా పాటలలోకి వస్తే ఈ రాగములో ఎక్కువగా పాటలు పలికించిన ఘనత 'రమేశ్ నాయుడు ' కి దక్కుతుంది. అతి తక్కువ వాయిద్యాలతో చక్కనైన పాటలు అందించారు. ఇక ఇళయరాజా అయితే విషాద కి ప్రశిద్ధి చెందిన రాగములో గొప్ప ప్రణయగీతాన్ని సృష్టించారు (అబ్బ నీ తియ్యనీ దెబ్బ).


ఆకాశవాణి సిగ్ నేచర్ ట్యూన్ కూడా శివరంజని రాగములో నే చేయబడింది. 



ఈ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమ పాటలు : 


* అన్నా అన్నా విన్నావా - ఇలవేల్పు
* అంతా బ్రాంతి ఏనా జీవితాన వెలుగింతేనా - దేవదాసు
* బఠో బైఠో పెళ్ళికొడకా.. ఆల్ రైటో రైటో నా పెళ్ళికూతురా - పెళ్ళి సందడి
* బుగ్గి అయిన నా బ్రతుకు - పల్నాటి యుద్ధం
* ఓ వీణ చెలి నా ప్రాణ సఖి - చంద్ర హాస
* నా జీవితం నీకంకితం - శ్రీకృష్ణ విజయం
* నిను వీడని నీడను నేనే - అంతస్థులు
* శ్రీరాముని చరితము తెలిపెదమమ్మ - లవకుశ
* తీరేనుగా నేటితో నీ తీయని గాధ - పెళ్ళి కానుక
* సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు - పుట్టినిళ్లు మెట్టినిల్లు
* చరిత్ర ఎరుగని మహాపాతకం - మహామంత్రి తిమ్మరసు
* ఏల పగాయె ప్రభు మనకు - లైలా మజ్ఞు
* వగల రాణివి నీవే - బందిపోటు
* చాలదా ఈ చోటు - నేనంటే నేనే
* కనులలో నీ రూపం - రావణుడే రాముడైతే
* ఒకటైపోద్దామా ఊహల వాహిణిలో - ఆస్తులు అంతస్థులు
* గుట్ట మీద గువ్వ కూసింది - బుద్ధిమంతుడు
* మెరిసే మేఘమాలిక - దీక్ష
* ఆకాశ దేశానా - మేఘసందేసం
* కనుపాప కరవైన కనులెందుకు - చిరంజీవులు
* అంతర్యామి అలసితి సొలసితి - అన్నమయ్య
* శివరంజని.. నవరాగిని - తూర్పు పడమర
* అభినవ తారవో - శివరంజని
* నా గొంతు శృతిలోనా - జానకి రాముడు
* పాడవోయి భారతీయుడా - వెలుగు నీడలు
* వీణ నాది తీగ నీది - కటకటాల రుద్రయ్య
* రాయినైనా కాకపోయిని రామ పాదము సోకగా - గోరంత దీపం
* చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి - ప్రేమ సాగరం
* ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం - రంగూన్ రౌడి
* వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది - కల్యాణ వీణ
* ఓ బంగరు రంగుల చిలక - తోట రాముడు
* ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నె మనసులు
* జననీ జన్మభూమిశ్చ - బొబ్బిలి పులి
* ఇది తొలి రాత్రి - మజ్ఞు
* ఇది చదరని ప్రేమకు శ్రీకారం - అంకుశం
* అందమైనా వెన్నెలలోనా అచ్చ తెనుగు పడుచువలే - అసెంబ్లీ రౌడి  
* నీ కళ్ళలో స్నేహము - ప్రేమ ఖైది
* ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెల ఏరు - సిరివెన్నెల
* ఈ జగమే ఈ జగమే ఆగెను నిన్ను చూసి - నిలాంబరి
* శివాని..భవాని - స్వాతి కిరణం
* చందమామ కథలో చదివా - ఈ అబ్బాయి చాలా మంచోడు
* సౌందర్యమా కలగన్న కాశ్మీరమా - ఫూల్స్
* అమ్మమ్మ మాయగాడే - పేళ్ళి సంబంధం
* అది ఒక రాతిరి - జగన్
* పాటల పల్లకి పై ఊరేగే చిరుగాలి - నువ్వొస్తావని
* సన్నజాజి పువ్వా.. చిరునవ్వే నవ్వవా - యువరత్న
* ఈ గాలిలో ఎక్కడో అలికిడి - అగ్ని పర్వతం
* ఓ బంగరు రంగుల చిలక - తోటరాముడు
* మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు - ముద్దుల మావయ్య
* హరి ఓం భజగోవిందం - రాజా రమేశ్
* నువ్వు లేక అనాధలం - శిరిడి సాయి మహత్యం
* పెళ్ళంటే పందిళ్లు - త్రిశూలం
* కనురెప్ప పాడింది కనుసైగ పాట - జయసుధ
* మధుమాసపు మన్మధ రాగమా - ఆయనకిద్దరు
* ఏదో మనసుపడ్డాను కానీ - అమ్మ దొంగ
* సింధూరపువ్వా తేనె చిందించరావా - సింధూరపువ్వు
* గగనాలకేగిన చిరు తారవో - పాపే మా ప్రాణం
* ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా - అడవి రాముడు (కొత్తది)
* అనగనగా ఒక నిండు చందమామ - పెళ్ళిపందిరి
* నేనొక పూల మొక్క కడ నిల్చి (పుష్ప విలాపం ) 




ఈ రాగములో ఉన్న హింది పాటలు :




* జానే కహా గయే వో దిన్ - మేరా నాం జోకర్
* ఆవాజ్ దేఖే హమే తుం బులాదో - ప్రొఫెసర్
* మేరే నైనా సావన్ భాధో - మెహబూబా
* ఓ మేరే సనం - సంగమ్
* నా కిసి కీ ఆంఖ్ క నూర్ హూ - లాల్ ఖిలా
* లగే నా మోరా జియా - గూంఘట్
* పియా మిలన్ కి - పియా మిలన్ కి
* సన్సార్ హై ఎక్ నదియ - రఫ్ తార్
* ఓ సాతీ రే తెరే బినా క్యా జీనా - ముకద్దర్ కా సికందర్
* నజర్ ఆతీ నహి మంజిల్ - కాంచ్ ఔర్ హీరా
* తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్ - ఏక్ దూజే కే లియే
* గుం నాం హై కోయి - గుమ్ నామ్
* దిల్ నే ఫిర్ యాద్ కియా - దిల్ నే ఫిర్ యాద్ కియా
* బహారో ఫూల్ బర్సావో - సూరత్
* మేరి కిస్మత్ మే తూ నహీ షాయద్ - ప్రేమ్ రోగ్
* చందామామా దూర్ కే - వచన్
* బనాకే క్యూ బిగాడా రే - జంజీర్
* దిల్ కె ఝరోకోమే తుఝ్ కో బిటాకే - బ్రహ్మచారి
* మిల్తీ హై జిందగీ మే ముహోబత్ ఖభీ ఖభీ - ఆఖే
* సాత్ సాత్ రెహనా మేరీ సారీ జిందగి - దిల్వాలే
* హం తో చెలే పర్దేస్ హం పర్దేశీ హో గయే - సర్గమ్
* యాద్ మేరీ ఆయేగీ - ఏక్ జాన్ హై హం
* తుం సే మిల్కర్ నాజానే క్యూ - ప్యార్ ఝుక్తా నహీ
* ఖభీ ముఝే రులాయా - ఖయామత్
* తడప్ తడప్ కే ఇస్ దిల్ సే ఆహ నికల్ తీ హుయీ - హం దిల్ దే చుకే సనమ్
* తూ నే ప్రీత్ జో ముఝ్సే జోడి - మీరా కా మోహన్
* నా జారే యూ ముఝే చోఢ్ కే - ఆజ్ కా అర్జున్
* ప్యార్ క పల్చిన్ బీతే హుయే దిన్ - కువారి
* మేర ప్యార్ భీ తూహై - సాథి
* సూరజ్ కి గర్మీ సే - పరిచయ్
* తేరే సంగ్ ప్యార్ మై నహీ తోడ నా - నాగిన్
* పర్బత్ సే కాలీ గటా టక్రాయి - చాందిని
* బాబుల్ కి దువాయే లేతీ జా - నీల్ కమల్
* సూరజ్ కబ్ దూర్ గగన్ సే - కరణ్ - అర్జున్
* రంగ్ ఔర్ నూర్ కి బారాత్ కిసే పేష్ కరూ - గజల్
* నా కోయి ఉమంగ్ హై - కటీ పతంగ్
* కహి దీప్  జలే కహి దిల్ - బీస్ సాల్ బాద్
* ఓ పియా పియా క్యూ భులా దియా - దిల్
* దోస్త్ దోస్త్ నా రహా - సంగమ్
 



శంకరాభరణం


ధీర శంకరాభరణం రాగాన్నే వాడుకలో శంకరాభరణం అని అందురు. ఇది 29 వ మేళకర్త రాగము. 



ఆరోహణ : : S R2 G3 M1 P D2 N3 S  


అవరోహణ : S N3 D2 P M1 G3 R2 S     


సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం ఐదవ బాణ చక్రంలో ఐదవ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు.  ఈ రాగము సంపూర్ణ రాగము. నలభైకి పైగా జన్య రాగాలు గల విశిష్ట మైన రాగము శంకరాభరణము. అందులో ముఖ్యమైనవి : ఆరభి, అఠాన, బిళహరి, దేవనాగరి, కదనకుతూహలం, హంసధ్వని, సుద్ధ సావేరి, పూర్ణచంద్రిక, కేదరం. 


ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన ' నరసయ్య ' అని చెప్పుకొంటారు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైనది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట.
ఈ రాగము ఉదయం రెండో భాగము ( 9 నుండి మధ్యాహ్నం వరకు) వినే రాగము అయినప్పటికినీ అన్ని వేళలా వినదని రాగము.  ప్రేమకు, భక్తికి, ఆధ్యాత్మితకు , గంభీరానికి, శృంగారానికి , ఆలోచనలకి అణువైన రాగము.
శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతములో బిలావల్ రాగానితో పోల్చవచ్చు.  జాతీయ గీతం "జనగణమణ " ఈ రాగములో స్వరపరిచారు. 


ప్రముఖ కీర్తనలు :


1. ఎదుట నిలచితే - త్యాగరాజ స్వామి
2. మరియాద గాదురా - త్యాగరాజ స్వామి
3. స్వర రాగ సుధ  - త్యాగరాజ స్వామి
4.  ఎందుకు పెద్దలవలె బుద్ధినీయవు - త్యాగరాజ స్వామి
5. మనసు స్వాధీనమైన  - త్యాగరాజ స్వామి
6. బాగు మీరగను (వేంకటేశ పంచరత్రాలలో ఒకటి) - త్యాగరాజ స్వామి
7. సుందరేశ్వరుని జూచి సురలఁ జూడ మనసు వచ్చునా - త్యాగరాజ స్వామి
8. అలరులు కురియగ - అన్నమయ్య
9. ఇతడేనా ఈ లోకములో గల - రామదాసు
10. తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు - రామదాసు
11. ఎంతో మహానుభావుడవు నీవు - రామదాసు
12. దశరధరామ గోవింద నన్ను- రామదాసు
13. రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా - రామదాసు
14. రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె - రామదాసు
15. నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ - రామదాసు
16. అక్షయలింగ విభో - ముత్తుస్వామి దీక్షితార్
17. శక్తిసహిత గణపతిం - ముత్తుస్వామి దీక్షితార్
18. సదాశివం ముపాస్మహే - ముత్తుస్వామి దీక్షితార్
19. దక్షిణామూర్తే - ముత్తుస్వామి దీక్షితార్
20.  దేవి మీన నేత్రి - శ్యామశాస్త్రి
21. సరోజదళ నేత్ర - శ్యామశాస్త్రి
22. శారదే సదాస్రయే - కృష్ణస్వామి అయ్యర్
23. శంభో జగదీశ - రామస్వామి దీక్షితార్
24. పశ్యతి దిశ్యతి (అష్టపది) - జయదేవుడు
25. శంకరాచార్యం - సుబ్బరాయ దీక్షితార్



శంకరాభరణ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :



1. బుద్ధేనాంజలి నమామి - విప్రనారాయణ
2. ఆనందం అర్ణవమైతే - కన్యాశుల్కం
3. ఓంకార నాదానుసంధానమౌ గానమే -  శంకరాభరణం
4. మరచి పోరాదోయ్ చేసిన బాసలు - మనోరమ
5. వెన్నెల్లో గోదారి అందం - సితార
6. ఉరికే చిలకా - బొంబాయి
7. చిన్ని చిన్ని ఆశ - రోజ
8. ఎల్లిపోతోంది ఎల్లిపోతోంది జోడేడ్ల బండి - రోజులు మారాయి
9. నా హృదయం లో నిదురించే చెలి - ఆరాధన
10. జోరుగా హుషారుగా షికారు పోదమా - భార్యాభర్తలు
11. దేవమహదేవ మము బ్రోవుము శివ - భూకైలాస్
12. నలుగిడరే చెలువుగా శ్రీగౌరికి - వినాయక చవితి
13. నాకో తోడు కావాలి - చదువుకున్న అమ్మాయిలు
14. ఇదే పాట ప్రతీ చోట - పుట్టినిల్లు - మెట్టినిల్లు
15. చెట్టులెక్కగలవా ఓ నరహరి - చెంచులక్ష్మి
16. ఓ రంగయో - వెలుగు నీడలు
17. చిలకా గోరింకా కులికే పకా పకా - చెంచులక్ష్మి
18. విన్నావా యశోదమా (కాళింది మడుగున విషమును కలిపే కాళియు తలపై తాందవ మాడి) - మాయాబజార్
19. కానరార కైలాశ నివాశ - సీతారామ కల్యాణం
20. అహా నా పెళ్ళియంట - మాయబజార్
21.కమ్  కమ్ కమ్ కంగారు నీకేలనే - శాంతి నివాసం
22.ఆశలు తీర్చవే జనని - శాంటినివాసం
23.చల్లనైన తల్లివి శంకరు రాణివి - శ్రీ వేంకటేశ్వర మహత్యం
24.అందెను నేడే అందని జాబిల్లి - ఆత్మ గౌరవం
25. నీటిలోన నింగిలోన - వివాహ బంధం
26. వేయి కన్నులు చాలవుగా - సీతారాముల కల్యాణం
27. చిన్నారి నీ చిరు నవ్వు - పసిడి మనసులు
28. అందాల ఓ చిలుకా - లేత మనసులు
29. దేవా దివ్య కృపాకర - కాళహస్తీ మహత్యం
30.పాడవోయి భారతీయుడా (పదవీ వ్యామోహాలు)- వెలుగు నీడలు
31. హల్లో డార్లింగ్ మాటాడవా - శభాష్ రాముడు
32. కులాశ రాదోయ్ రమ్మంటే - అన్నపూర్ణ



ఈ రాగములో హింది సినిమా పాటలు చూద్దాము. 




* భోర్ ఆయి గయా అంధియార - బవర్చి
* సారే కె సారే గామ కో లేకే గాతే చెలే - పరిచయ్
* దిల్ హై చోటా సా చోటి సి ఆష - రోజ
* తుహిరే తుహీరే - బొంబాయ్
* ముఝ్ కో అప్నే గలే లగాలో - హుం రాహీ
* మేరీ లాడ్లీ హై - అందాజ్
* హే దిల్ హై ముషికిల్ జీనా యహా - సి.ఐ.డి
* దిల్ తడప్ తడప్ కే పుకారే - మధుమతి
* ఆజ్ హుం అప్నే దువాకా అసర్ దేఖేగ్నే - పాకీజా
* బచ్పన్ కి ముహోబత్ కో - బైజూ బావరా
* జిందగీ ప్యార్ కే దో చార్ ఘడి - అనార్కలి
* అయేగా ఆనే వాలా - మహల్
* అల్లా తేరో నాం - హం దోనో
* యాద్ కియా దిల్ నే కహాహో తుం - పతిత
* మేరే మెహబూబ్ తుఝే - మెహబూబ్
* పియా తూసే నైన అలాగే రే - గైడ్
* జీవన్ కె సఫర్ మే రాహి - మునిం జీ
* ఏ మేరే హుం సఫర్ ఏ మేరే జానేజా - బాజీ గర్
* హోలే హోలే గూంగట్ - గూంజ్ ఉఠీ షహనాయి
* ఏ దిల్ నా హోతా బేచారా - జువెల్ తీఫ్