Search This Blog

Saturday, October 7, 2017

విధి బలీయమైనది

ఇంట్లో ఎవరూ లేరు, బయట చల్లని గాలి, చిన్న తుంపర.. ఆహా ఇలాంటి టైమ్ లో మంచి కాఫీ కప్పు తో అందమైన సినిమా చూస్తే ఎలా ఉంటుంది.. అలాంటి ఆలోచన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తో హాల్ లోకి వచ్చి టి.వి ఆన్ చేశాను.


పడవలో మాధవి ( అదేనండి 70-80 దశకంలో సినిమాని ఏలేసిన అమ్మాయి), పక్కన ఒక బుడ్డోడు ఇంకా సినిమా పేర్లు పడుతున్నాయి... ఏదో 70 - 80 లో వచ్చిన సినిమా చూద్దాము అనుకున్నాను ....


భక్తప్రహ్లాద సినిమాలో కశ్యపుడు " విధి బలీయమైనది " అని అన్నప్పుడు ఏంటో అనుకున్నా.  విధి బలీయమైనది.. మనము బలహీనులమే అని గ్రహించడానికి ఒక్కొక్కరికి ఒక్కో సంధర్భం లో జ్ఞానోదయం అవుతుంది.


సూక్షంగా సినిమా :


మాధవికి కి పెళ్ళి అవుతూ ఉండగా పెళ్ళి కొడుకు కరంటు షాకు తో చనిపోతాడు, అందరూ మాధవిని తిడుతోంటే పక్కన ఉన్న ఒక బుడ్డోడు ఆవిడ మెళ్లో ఆ తాళి కట్టేస్తాడు. ఇద్దరూ వేరే ఊరికి వెళ్లి అక్కడే ఒక ఇంట్లో ఉంటారు. ఆవిడ ఒక రాధగా , ఆ బుడ్డోడు ఒక కృష్ణుడిగా ఊహించేసుకొని ఆరాదించేస్తూ ( ఆక్రోషించేస్తూ ) పాటలు కూడా పాడేసుకుంటుంది. ఆ బుడ్డోడు పెద్దైయ్యాక రాజేంద్ర ప్రసాద్. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ మాధవి ఒక డాక్టర్ దగ్గర నర్స్ గా చేస్తుంది . ఆ డాక్టర్( శరత్ బాబు ) ఈవిడని ఇష్టపడతాడు. కానీ ఈవిడ తనకి పెళ్లైపోయిందని ఆ త్యాగరాజు ని రిజక్ట్ చేస్తుంది. అదేంటో శరత్ బాబు ప్రతీ సినిమాలోనూ త్యాగరాజే అవుతాడు (త్యాగాలు చేస్తూ).


అలా అలా సాగీ కథ చివర్లో నిజం చెప్పి మాధవి చచ్చి పోతుంది (అదేదో మొదట్లో చస్తే ఆరభం కాదిది అంతం అని సినిమా టైటిలు పెట్టేయచ్చు కదా).


ఒక కంటి తుడుపు చర్యా ఏమిటంటే, ఒక పాట... ఈ పాట నేను చిన్నప్పుడు రేడియో లో విన్నాను.. ఆ టైం లో నాకు చాలా నచ్చిన పాట అది " రాధా కృష్ణయ్య ఇటు రా రా కృష్ణయ్య " పాట సాహితీ పరం గా బాగుంది కానీ చూడటానికే చాలా ఛండాలంగా ఉంది.

ఆ పిల్లాడిని చూసి మాధవికీ కలిగే ఆరాధన చాలా వికారం గా ఉంటుంది.

ఈ సినిమా అయ్యేటప్పటికి పిల్లలు బయటనుండి తిరిగి వచ్చారు, రాగానే " ఏంటీ ఒంట్లో బాలేదా జ్వరం వచ్చిందా ? అలా ఉన్నావేంటి " అని అడిగారు.



కాబట్టి ఎవరూ ఈ సినిమా ఎప్పుడైన ఎక్కడైనా పొరపాటున ఫ్రీ గా వస్తోంది కదా అని మాత్రం చూడకండి. చేతిలో రిమోట్ ఉండగా మార్చలేకపోయావా? అనేగా మీ ప్రశ్న... మారిస్తే విధి బలీయమెందుకౌతుంది..


దేవుడా రక్షించు నా సినీ అభిమానులని

పగబట్టిన దర్శకుల నుండి...

పొగరెక్కిన ప్రోడ్యూసర్ల నుండి...

పైత్యమెక్కిన హీరోయిన్ల నుండి...

పిచ్చెక్కిన రచయితలనుండి...

ముదిరిపోయిన బాలనటుల నుండి...


ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా... మూడు ముళ్ల బంధం....


ఇంతటి తో శెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ విధివక్రించి ఏవైనా చెత్త సినిమాలు చూస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను...

(ఇది కొన్ని రోజుల క్రితం చూసిన సినిమా.. జాగ్రత్త మళ్ళీ ఈ సినిమా వస్తోందని అడ్వటైజ్ మెంట్ వచ్చింది).

10 comments:

  1. జాగ్రత్త చెప్పినందుకు థాంక్సండి 🙂. మీరు హెచ్చరించకపోయుంటే, టీవీ ఛానెళ్ళ ఏంకర్ల పరిభాషలో చెప్పినట్లు "అడ్డంగా దొరికిపోయేవాళ్ళం" 😀😀.

    ReplyDelete

  2. ఏదన్నా కొత్త సినిమా చూసి తలనొప్పి తెచ్చుకున్నా రంటే పోనీ లే అని వూరుకోవచ్చు :)

    19 70 80 దశకాల చిత్రాన్ని 2020 దశకంలో చూసి తెచ్చుకున్నారంటే నిజ్జంగా విధి బలీయమైనదే :)


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. :)) avunu...చేతిలో రిమోట్ ఉండి మార్చలేకపోయానంటే.. విధి బలీయమైనదే...

      Delete
  3. జిలేబీ గారు వచనంలో వ్రాసారంటే విధి బలీయమైనదే !

    ReplyDelete
  4. ఈ సినిమాని అప్పుడెప్పుడో నేనూ చూసాను. ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. గుర్తుకు రావట్లేదు కానీ, ఏదో పౌరాణిక సినిమాని సాంఘికంగా మార్చేసారు.

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్యనే ఇదే కాన్సెప్ట్ తో టి. వి లో సీరియల్ మొదలయ్యిందిట. (హిందిలో లెండి). అది సుష్మ స్వరాజ్ గారు ఆపు చేయించేశారుట. ఎంత సంఘ సేవ చేశారో!

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. పౌరాణిక సినిమాలో ఏం ఖర్మ!అదేదో సాంఘీక సినిమాలో సాక్షాత్తూ శొభన్ బాబు "విధి బలీయం,అనుల్లంఘనీయం!" అని గ్రాంధికం డయలాగు చెప్పాడు.డయలాగ్ రైటర్ బ్రాహ్మడు కావచ్చు - బ్రాహ్మలకే ఇట్లాంటి భాష వచ్చు:-)

    ReplyDelete
    Replies

    1. హరిబాబు యెవరికో లీడ్ యిస్తున్నట్టున్నారోచ్ :)
      ఇక ఈ టపాలో సందడే సందడి :)


      బ్రేవ్
      జిలేబి

      Delete