Search This Blog

Tuesday, October 3, 2017

తుమ్ ఆగయే హో

  (మళ్ళీ మళ్ళీ ఇది వచ్చే రోజు)

 

పెనం మీద వేడి వేడి పెసరట్టు నోరూరిస్తోంది! తినాలని ఉంది కానీ... తనతో పాటు తింద్దామని ఒక ప్లేట్ లో తనకి రెండు, నాకు ఒకటి ఉంచాను. నిన్న కూడా అంతే... తనకి నా చేతి ఇడ్లీలంటే ఇష్టమని, నేను తినకుండా తన కోసం వైట్ చేసి చివరకి రాత్రి ఆ చల్లారిన ఇడ్లీనే తిని ఉన్నాను. నేనే తన గురించి ఇంత ఆత్రము పడాలి కానీ, అసలు తనకి నేను గుర్తొస్తానా? వెళ్ళి పదిహేను రోజులయ్యింది, ఒక్క సారైనా ఫోన్ చేస్తే కదా! నేను చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేం మనిషో! కాసంత అభిమానం కూడా లేదు! రోజు తనతోటే టీ తాగే అలవాటు, టీ తాగుతొన్నంత సేపు ఎన్ని కబుర్లో! ఏంటో ఇప్పుడు ఒక్కదాన్నే తాగుతోంటే చాలా వెలితిగా ఉంది. తను వచ్చాక కొన్ని రోజులు మాట్లాడకూడదు. ముభావంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అలుసు అయ్యిపోతాను! తనకిప్పుడు వాళ్ళ వాళ్ళతో టైం పాస్ అవుతుండవచ్చు, నాకే అంతా శూన్యం గా ఉంది లైఫ్!  😞

 

" తెరే మేరే హోటో పే మీటే మీటే గీత్ మిత్వా " అని కాలింగ్ బెల్! ఒకప్పుడు కాలింగ్ బెల్ "డింగ్ డాంగ్ " అని మ్రోగేవి. అదేంటో ఇప్పుడు పూర్తి పాటలు. ఏం "మీటే మీటే గీత్" వినిపిస్తుందో వచ్చి! ఈ పాట హిందిలో "చాందిని " సినిమాలోది. ఇదే డబ్బింగ్ కూడ అచేస్తే మా క్లాస్ లో ఒక తుంటరి "నీకీ నాకి పెదవులలో తియ్య తియ్యని పాటలే ప్రియా " అని మక్కికి మక్కి అనువాదం చేసింది. ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఆ తెలుగు ప్యారెడి గుర్తొస్తుంది! 😋


తనేమో అని ఆత్రంగా వెళ్ళి చూస్తే పక్కింటావిడ! ఆవిడ ఎందుకొచ్చిందో అర్ధమయ్యింది. కాస్త కాఫీ చేసి ఆవిడకో గ్లాస్, నాకో గ్లాస్ తెచ్చుకొన్నా! ఏవేవో కబుర్లు చెబుతోంది. "ఇంకా తను రాలేదా? " అని అసలు ప్రశ్న వేసేసింది. కళ్ళలో నుంచి ఉబుకి వస్తోన్న నీటిని ఆపుకొని.. "లేదండి " అని ఏదో పనునట్టు వంటింట్లోకి వచ్చేశా! 😢😢ఆవిడ తన గురించి కనుకోడానికే వచ్చింది. కాఫీ తాగి కాసన్ని ఊసుబోని కబుర్లు చెప్పి వెళ్ళింది.


టైమ్ పదయ్యింది... ఇంక ఈ రోజు తను వచ్చే అవకాశాలు తక్కువే! ఇంక తప్పద్దు.. తినాలి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా... వంటింట్లోకి తప్పనిసరై వెళ్ళాను. "ఏం వండాలి? ఏదో సింగిల్ ఐటమ్ చేసేసుకుంటా! ఆకలి తీరాలి అంతే! " రుచుల మీద మనసు వెళ్ళడం లేదు! గత పదిహేనురోజూల నుండి తినాలి కాబట్టి తింటున్నాను! కాళ్ళు ఒళ్ళు ఒకటే నొప్పి... తను రాగానే ఈ విషయం కూడా చెప్పాలి... ఈ నొప్పులకు కారణం తనేనని!!! 😞😔


మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది... " తుమ్ ఆగయే హో నూర్ ఆగయా హై " . మనసులో ఏదో మూల చిన్న ఆశ, అదే ఆశతో తలుపు తీశా!


"తనే "... నిజమే తను రావడమే నా ఇంటికి నూర్ వచ్చింది. మరే నా ఇంటికి దీపం తనేగా... అబ్బా.. వసంతం వచ్చినంత ఆనందంగా ఉంది! 😍😍😍😍


"రా లక్ష్మి " అంటూ సాదరంగా ఆహ్వానించాను.. మా ఇంటి పనిమనిషిని! (బెట్టు చేసి మాట్లాడకపోతే... మళ్ళీ మానేస్తుందన్న భయంతో)!!

14 comments:

  1. భలే సస్పెన్స్ తో చెప్పారు :) అంతేనండి మన ఆనందాలు పనిమనుషులతోనే :)

    ReplyDelete
    Replies
    1. //మన ఆనందాలు పనిమనుషులతోనే/// 200%

      Delete
  2. మీ బ్లాగ్ పేరు , ఇమేజ్ బాగున్నాయి. మీకు వీలున్నప్పుడు నా బ్లాగ్ చుడండి .
    sahiti-mala blogspot.com

    ReplyDelete

  3. మీరూ కొసమెరుపు కథకులన్న మాట సుశ్రీ గారిలా :)

    అదురహో

    జిలేబి

    ReplyDelete
  4. మలుపు ... భలే తిప్పారే!?
    తలుపు ... మరోసారి తెరవండి ...
    (ఈ సారి వినండి ... sandese aaten hain ...
    Ki tum bin ye ghar soona soona hai |
    For without you, this house is empty, empty)
    couriered వీరతాళ్ళు ... :)

    ReplyDelete
  5. మీది కొత్త బ్లాగు అనుకుంటాను. సస్పెన్సు తో కథ బాగా చెప్పారు :).

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. అక్కడ ఓ హెన్రీ, ఇక్కడో హెన్రీ... ట్విస్టు బావుంది.

    ReplyDelete